Advertisement
Google Ads BL

నాని మరో ఫస్ట్ లుక్ రాబోతుంది..!


నాని హీరోగా శేఖర్ కమ్ముల శిష్యుడు నాగిని దర్శకునిగా పరిఛయం చేస్తూ 'ఎవడే సుబ్రహ్మణ్యం' పేరుతో  ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. స్వప్న సినిమా బేనరపై నిర్మాత అశ్వనీదత్ కుమార్తె ప్రియాంకాదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విలక్షణ కధాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను  జనవరి 10న విడుదల చేయనున్నారు. ఈ చిత్రం గురించి నాని ట్వీట్ చిస్తూ... వినూత్నకదాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం 36మంది యూనిట్ సభ్యులు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ లో  సముద్రమట్టానికి 5300 మీటర్ల ఎత్తులో చిత్రీకరణ జరిపాం. 40రోజులు పాటు ఈ షెడ్యుల్ జరిగింది.అయితే అక్కడ చలికి తట్టుకోలేక 16మంది  మధ్యలో వెనుదిరిగారు. చివరివరకు 20మంది మాత్రమే ఉన్నారు. సగం పర్వతశ్ర్రేనులూ,సగం నగరంలో ఈ సినిమా చిత్రీకరణ చేశాం.. అని తెలిపాడు. కాగా ఈ చిత్రంలో నాని సరసన రితివర్మ,మలయాళ భామ మాళవిక నాయర్ నటిస్తున్నారు.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs