Advertisement
Google Ads BL

వెంకయ్యపై పక్షపాతిగా ముద్ర పడుతుందా..??


తెలంగాణ, ఏపీల మధ్య ఎమ్సెట్‌ వివాదం ముగియడం లేదు. ఓ మెట్టు దిగడానికి రెండు రాష్ట్రాలు ససేమిరా అనడంతో ఇంటర్‌ విద్యార్థుల భవిష్యత్తు సందిగ్ధంలో పడింది. మరోవైపు ఈ వివాదానికి తెరదించడానికి గవర్నర్‌ నరసింహన్‌ చేస్తున్న ప్రయత్నాలు కూడా కొలిక్కిరావడం లేదు. ఈ తరుణంలో ఎమ్సెట్‌ విషయమై కేంద్రం జోక్యం తప్పనిసరిగా మారింది. కాని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఈ విషయమై మధ్యవర్తిత్వం వహించడానికి అంగీకరించడం లేదు. ఢిల్లీలో వెంకయ్యను ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కలుసుకోగా ఈ మేరకు స్పష్టం చేశాడు. గవర్నర్‌ మధ్యవర్తిత్వంతోనే సమస్యను పరిష్కరించుకోవాలని, తాను కూడా ఈ విషయమై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో మాట్లాడినట్టు స్పష్టం చేశారు. అయితే ఈ విషయమై తాను జోక్యం చేసుకున్నా.. టీ-సర్కారు ఆయన ప్రతిపాదనలకు ఒప్పుకోదని, ఆయనపై ఏపీ పక్షపాతిగా ముద్ర వేస్తుందన్న అనుమానాలతోనే వెంకయ్య మధ్యవర్తిత్వానికి అంగీకరించనట్లు రాజకీయవర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs