సౌత్ సినిమాల రీమేక్స్ తో తన కెరీర్ ను మరింత పటిష్టం చేసుకొని హిట్ల బాటలో దూసుకెళుతున్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్. ఆయన సౌత్ లో ఏ సినిమాలు రెడీ అవుతున్నాయి? ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి? వాటికి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ ఉంది? అనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాడు. నచ్చితే వెంటనే కొనుక్కొని రీమేక్ చేస్తుంటాడు. ఆమధ్య రవితేజ 'కిక్' చిత్రం రీమేక్ చేసిన సల్మాన్ ఇప్పుడు అదే కాంబినేషన్ లో రూపొందుతున్న 'కిక్ 2' పై కన్నేసాడట. రీసెంట్ గా ఈ చిత్రం గురించి, స్టొరీ లైన్, కాన్సెప్ట్ గురించి ఈ చిత్ర నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ కు ఫోన్ చేసి చిత్ర విశేషాలను తెలుసుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్రం రీమేక్ విషయంలో అయన ఓ నిర్ణయానికి వచ్చి, కొంత మొత్తం అడ్వాన్సుగా చెల్లించనున్నాడని, సినిమా హిట్ అయితే దాన్ని రీమేక్ చెయదానీ సన్నాహాలు చేసుకుంటాడని అంటున్నారు. సురేంద్రరెడ్డి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకం పై మంచి ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో హీరో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని, తండ్రి కొడుకులుగా ఆయన నటిస్తున్నట్లు సమాచారం.