Advertisement
Google Ads BL

దుమ్మురేపుతున్న 'గోపాల గోపాల'...!


వెంకటేష్, పవన్ కళ్యాణ్ లు కలిసి నటిస్తున్న 'గోపాల గోపాల' చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు  ఉన్నాయి. ఆడియో విడుదల తరువాత ఈ అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగింది. పవన్ పై ఉన్న ఎక్స్ పెక్టేషన్స్, మల్టీ స్టారర్ క్రేజ్ ఈ  చిత్రానికి ప్లస్ అవుతున్నాయి. కొన్ని ఏరియాలు మినహా చిత్రం బిజినెస్ దాదాపు పూర్తయినట్లే. ట్రేడ్ సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆంధ్రా 18కోట్లు, తెలంగాణ 20 కోట్లు కలిపి మొత్తం 38 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే దేశంలోని మిగతా ప్రాంతాలు, ఓవర్ సీస్, శాటిలైట్ రైట్స్ ఇతరత్రా అన్నీ కలిపి దాదాపు 50 కోట్ల వరకు బిజినెస్ అవుతుందని తెలుస్తోంది. ఈ బిజినెస్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. అన్నీ ప్రాంతాల నుండి డిస్ట్రిబ్యూటర్లు పోటీపడి మరీ ఈ చిత్రం రైట్స్ ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.      

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs