ఎన్నికలకు ముందు చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర తెలుగు దేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చింది. అప్పటివరకు అధికారపీఠం రేసులో లేని టీడీపీ బాబు పాదయాత్రతో వడివడిగా అడుగులు ముందుకువేస్తూ.. వైసీపీని వెనక్కినెట్టి అధికారాన్ని దక్కించుకుంది. ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు మరో పాదయాత్ర చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని జనవరి 18న స్మార్ట్ గ్రామం పథకాన్ని ప్రారంభించడంతోపాటు 18 కి.మీల పాదయాత్ర చేపట్టాలని బాబు భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై శనివారం జరిగిన పార్టీ సమావేశంలో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే ఈ పాదయాత్ర ఎక్కడ చేపట్టాలన్నదానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఎన్టీఆర్ జన్నించిన కృష్ణా జిల్లాలోనే పాదయాత్ర చేపట్టాలని ఆ జిల్లా నాయకులు బాబుకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.