పవన్ కళ్యాణ్ కు పి.వి.పి సంస్థ అధినేత పొట్లూరి వరప్రసాద్ కు విడదీయరాని స్నేహబంధం ఉంది. ఈ అనుబంధంతో ఆయన పవన్ తో ఓ సినిమా చేయనున్నాడనే వార్తలు వచ్చాయి. అయితే సడన్ గా ఏమైందో ఏమో గానీ ఇప్పుడు పవన్ స్థానంలో ఆయన మహేష్ బాబు తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని విశ్వసనీయ సమాచారం. 2015 ద్వితీయార్ధంలో ఈ చిత్రం ప్రారంభం కానుందని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడని సమాచారం. మొదటి నుండి మహేష్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో మరో సినిమా చేయనున్నాడనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాన్ని మహేష్ పి.వి.పి. సంస్థకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రచారంలోకి వచ్చిన 'బ్రహ్మోత్సవం' టైటిల్ తోనే ఈ చిత్రం రూపొందనుందని అంటున్నారు. మరి ఇంతకీ పొట్లూరి వరప్రసాద్ కు పవన్ కు మధ్య ఎందుకు చెడింది? అనే విషయం పై పలు ఊహాగానాలు వస్తున్నాయి. రాజకీయంగా వీరిద్దరి మధ్య అభిప్రాయబేదాలు వచ్చాయని, తన పొలిటికల్ కోరికను పవన్ తీర్చలేకపోవడంతోనే పొట్లూరి ఆయనతో తెగతెంపులు చేసుకున్నాడని టాక్.