మాజీ క్రికెటర్ అండ్ ఇండియన్ టీమ్ మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ జీవితకథ ఆధారంగా టోనీ డిసౌజా ఓ సినిమా రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అజారుద్దీన్ మొదటి భార్య నౌరీన్ గా బాలీవుడ్ బ్యూటీ ప్రాచీ దేశాయ్ నటించనుంది. అజారుద్దీన్ పాత్రలో ఇమ్రాన్ హష్మీ నటిస్తుండగా, అతని రెండో భార్య సంగీతాబిజలాని పాత్రలో కరీనాకపూర్ నటించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ప్రాచీ దేశాయ్ మాట్లాడుతూ.. అజారుద్దీన్ గురించి గానీ, అయన క్రికెట్ అండ్ పొలిటికల్ కెరీర్ గురించి కానీ నాకు ఏమీ తెలియదు. ఇప్పుడు ఈ సినిమా ఒప్పుకొన్న తర్వాత నుండి ఆయన జీవిత విశేషాలు తెలుసుకొంటున్నాను.. అంటోంది. మొత్తానికి బాలీవుడ్ లో బయోపిక్ ల హవా కొనసాగుతున్న నేపధ్యంలో అజారుద్దీన్ జీవితకథ ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో వేచిచుడాల్సివుంది..!