నిన్నటివరకు మాస్ జపం చేసిన రామ్ చరణ్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఆలోచనలో భాగంగా కృష్ణవంశీ తో 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం చేసిన సంగతి తెలిసిందే. సినిమా పెద్దగా ఆడకపోయినప్పటికీ తాను అనుకున్న గోల్ ను ఎంతోకొంత సాధించడంలో ఆయన సఫలం అయ్యాడు. కాగా చాలా గ్యాప్ తీసుకొని ఆయన శ్రీనువైట్ల చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా ఎంటర్టైన్మెంట్ కోరుకునే ఆడియన్స్ ను ఆయన లక్ష్యంగా చేసుకున్నాడు. ఫిబ్రవరి రెండో వారంలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో హీరోయిన్ గా మొదట బాలీవుడ్ బ్యూటీ సొనాక్షిసిన్హాను అనుకున్నప్పటికీ ఆమె 'లింగ' చిత్రంతో పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో సమంతను మొదటి సారిగా తన చిత్రంలోకి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. సమంతతో మొదటిసారి చేస్తే తమ జంట ఫ్రెష్ గా ఉంటుందనే ఆలోచనలో ఉన్నాడట.ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా అవకాశం ఉందని తెలుస్తోంది. అన్నట్లు ఈ చిత్రానికి 'మై నేమ్ ఈజ్ రాజు' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 'గోవిందుడు' తర్వాత గ్యాప్ రావడంతో ఇకపై అలా జరగకూడదని డిసైడ్ అయిన రామ్ చరణ్ బన్నీకి 'రేసుగుర్రం' వంటి కెరీర్ లో టాప్ హిట్ ను ఇచ్చిన దర్శకుడు సురేంద్రరెడ్డి తో తన తదుపరి చిత్రం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సురేంద్రరెడ్డి 'కిక్ 2' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత రామ్ చరణ్ సబ్జెక్ట్ మీదనే ఆయన కుర్చోనున్నట్లు తెలుస్తోంది.