Advertisement
Google Ads BL

మొత్తానికి 'ఉత్తమవిలన్' వస్తున్నాడు..!


లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తున్న 'ఉత్తమవిలన్' చిత్రం రిలీజ్ ముస్తాబవుతోంది. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. తెయ్యమ్ కళాకారుడిగా, సినిమా సూపర్ స్టార్ గా రెండు విభిన్న పాత్రల్లో ఆయన కనిపించనున్నాడు. కాగా ఈ చిత్రాన్ని తిరుపతి బ్రదర్స్ పతాకంపై లింగుస్వామి నిర్మిస్తున్నాడు. పూజాకుమార్, ఆండ్రియా, పార్వతి హీరోయిన్లు. ప్రముఖ కన్నడ నటుడు, కమల్ మిత్రుడు రమేష్ అరవింద్ ఈ  చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. చారిత్రక నేపధ్యం ఉన్న సినిమా ఇది. షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం లాస్ఏంజిల్స్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి ద్వితీయార్ధంలో విడుదలకు సిద్ధం చేస్తున్నారు. జనవరిలో ఆడియో వేడుకను జరపనున్నారు. ఇటీవల కన్ను మూసిన గురువు, ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని చూడాలని భావించిన ఆయన చివరి కోరిక నెరవేరకపోవడం దురదృష్టకరం. కాగా ఈ చిత్రాన్ని తన గురువుకు అంకితమిచ్చే యోచనలో కమల్ ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్, డైలాగ్స్ కూడా కమలే అందిస్తుండడం విశేషం. 'ఉత్తమన్' అనే పాత్ర 8వ శతాబ్దానికి డ్రామా ఆర్టిస్ట్ దని , ఇక మనోరంజన్ అనే మరోపాత్ర 21వ శతాబ్దానికి చెందిన సినిమా సూపర్ స్టార్ పాత్రని సమాచారం. కమల్ తో పాటు ఈ చిత్రంలో దక్షిణాదికి చెందిన నలుగురు సూపర్ స్టార్స్ కూడా అతిథి పాత్రల్లో నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రం బాగా ఆడితే తన 'విశ్వరూపం 2' చిత్రానికి మరలా బిసినెస్ క్రేజ్ వస్తుందనే ఆశతో కమల్ ఉన్నాడు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs