2014..ఎన్నెన్నో సంఘటనలకు నిలయమైంది. అందులో చెడు వుంది. మంచి వుంది. మంచి, చెడు ల సమాహారమే మనిషి జీవితం. కొత్త సంవత్సరం 2015 వచ్చేసింది. మళ్లీ మంచిని అధికంగా, చెడుని స్వల్పంగా తీసుకుంటూ ముందుకు నడవాల్సిన సమయమిది. అస్సలు చెడు అనేది లేకుండా అడుగు వేస్తె మంచి యొక్క విలువ పెద్దగా తెలియదు. అందుకే అన్ని కావాలని, వుండాలని కోరుకోవాలి. ముఖ్యంగా యువకులు ఏ పండగ అయిన అంతగా పట్టించుకోరు గానీ, ఈ న్యూ ఇయర్ రోజు మాత్రం తమకి చాలా స్పెషల్ గా ఉండాలనుకుంటారు. నిజానికి ఇది మన పండగ కాదు మెసొపొటేమియా(ఇరాక్) అనే వ్యక్తి న్యూ ఇయర్ అనే కాన్సెప్ట్ ను డిజైన్ చేసారు. తెలుగు వారికి ఈ పండుగ చేరువైనప్పటి నుంచి అన్ని దేశాలలో సంబరాలు జరుపుకున్నట్లే మన దేశంలో కూడా జరుపుకుంటున్నారు.
కేవలం వేడుకల కోసమే కాకుండా మన భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి. కోట్లాది మంది యువతీ యువకులలో వున్న శక్తిసామర్ధ్యాలను, మార్పు కావాలనే వారి తపనను సృజనాత్మకంగా మలచుకొని, దిశ, నిర్దేశం లను ఏర్పాటు చేసుకోవాలి. మనదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగా కాకుండా అభివృద్ధి చెందిన దేశంగా మారాలని ఈ 2015 ఒక పెద్ద మార్పునకు నాంది పలకాలని కోరుకుందాం. అదే విధంగా బతకడానికి కావాల్సింది గుక్కెడు నీరు, గుప్పెడు మెతుకులు కాదు గుప్పెడు జ్ఞాపకాలు. ఆ జ్ఞాపకాలు మన తోడుంటే ఎన్ని సాహసాలైన చేయొచ్చు. గడచిపోయిన రోజులను గుర్తుంచుకోవలసిన అవసరం లేదు. ఆ రోజుల్లో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తుంచుకుంటే చాలు. ఆ సంఘటనల నుండి పొందిన సంతోషం, అలాగే ఆ సంఘటనల తో నేర్చుకున్న అనుభవం అనే పాఠాలు గుర్తుపెట్టుకోవాలి. అదే మరో మార్గానికి దారి చూపుతుంది.
ప్రాణం ముఖ్యం కాదు. ఆ ప్రాణం వున్న రోజుల్లో ఏం సాధించం అనేదే ముఖ్యం. నలుగురికి మంచి చేయక పోయినా..వారికి చెడు చేయకుండా వుంటే చాలు. అలాగే మనం పోయాక ఆ నలుగురు అవసరం ఏంటో, ఆ నలుగురు ఎలా చెప్పుకోవాలో అనేది కూడా ఇక్కడ ముఖ్యం. ఇప్పటి వరకు ఎలా బ్రతికాం అనేది మరిచి పోకుండా..ఇకపై ఉన్నతంగా మార్గం వుండాలని కోరుకునే..ప్రతి ఒక్కరి ఆశలు, ఆశయాలు తీర్చేదిగా ఈ నూతన సంవత్సరం వుండాలని సినీజోష్ కోరుకుంటుంది.
మా పాఠకులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.