Advertisement
Google Ads BL

తలసానితో సినీ ప్రముఖుల భేటీ.!


టాలీవుడ్‌కు చెందిన సినిమా ప్రముఖులు సోమవారం ఉదయం ఇటీవల సినిమాటోగ్రఫీ మంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించిన తలసాని శ్రీనివాస యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కలిసిన వారిలో ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షులు ఎన్‌.వి.ప్రసాద్‌, ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా సెక్రటరీగా ఎన్నికైన సి.కళ్యాణ్‌, ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ అధ్యక్షులు బూరుగపల్లి శివరామకృష్ణ, తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ అధ్యక్ష, కార్యదర్శులు విజయేంద్రరెడ్డి, మురళీమోహన్‌, ఎఫ్‌.ఎన్‌.సి.సి అధ్యక్షులు కె.ఎస్‌.రామారావు, నిర్మాతలి మండలి కార్యదర్శి కొడాలి వెంకటేశ్వరరావు, మూవీ ఆర్టిస్ట్స్‌ సహాయ కార్యదర్శి మహర్షి రాఘవ, మరియు సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత డి.సురేష్‌బాబు, కాజా సూర్యనారాయణ, సురేష్‌ కొండేటి తదితరులున్నారు. ఈ సందర్భంగా సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ..‘చిత్ర పరిశ్రమ బాగు కోసం అన్ని విధాలా సహకరించడానికి నడుంకట్టిన తలసాని శ్రీనివాస యాదవ్‌గారికి ఈ పోస్ట్‌ రావడం సంతోషదాయకం’ అన్నారు. 

Advertisement
CJ Advs

కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ..‘తెలంగాణలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఇక ముందు ఎలాంటి వసతులు కావాలి, ఎలాంటి సౌకర్యాలు కావాలన్నది తలసాని గారి ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లాలి’ అన్నారు. 

బూరుగపల్లి శివరామకృష్ణ మాట్లాడుతూ..‘తలసాని శ్రీనివాస యాదవ్‌ గారికి శుభాకాంక్షలు. ఆయనకు పరిశ్రమ సమస్యల పట్ల ఒక అవగాహన వచ్చి ఉంటుందని భావిస్తున్నాను’ అన్నారు. కాజ సూర్యనారాయణ మాట్లాడుతూ..‘చిత్ర పరిశ్రమకు ప్రభుత్వ సహకారం ఎంతైనా ఉంటుందని ఆశిస్తున్నానన్నారు.

హైదరాబాద్‌లో అద్భుతమైన లొకేషన్స్‌ ఎన్నో ఉన్నాయి. సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ తలసాని శ్రీనివాస యాదవ్‌ మాట్లాడుతూ..‘అందరితోని కోఆర్టినేట్‌ చేసుకొని అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతోనే మొన్ననే ముఖ్యమంత్రిగారు  చెప్పారు. ప్రతీ సంవత్సరం రెండువందలకు పైగా చిత్రాలు మన హైదరాబాద్‌లో షూటింగ్‌లు జరుగుతున్న విషయం కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడున్నటువటుంటి ప్రధానంగా ఫిలిం చాంబర్‌ గానీ, అదేవిధంగా ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ గానీ, చాలా ఆర్గనైజేషన్స్‌ ఉన్నాయి. అందరితో కూర్చోని ఇక్కడ ఆర్టిస్టులు గానీ, డైరెక్టర్స్‌, 

ప్రొడ్యూసర్స్‌, టెక్నీషియన్స్‌ అందరితోని ఒక మీటింగ్‌ ఏర్పాటు చేసి వీలైనంత త్వరలో సీఎం ఆలోచనను షేర్‌ చేసుకోవడానికి, చలన చిత్ర రంగానికి మనకు ఉన్నటువంటి సమస్యల గురించి సీఎం దృష్టికి తీసుకెళ్లడం, ఈరోజు కూడా పెద్దలందరూ వచ్చి వివరించడం జరిగింది. 

వీలైనంత తొందరలోనే ఒక డేట్‌నుఫిక్స్‌ చేసుకొని హైదరబాద్‌ సిటీ క్లైమెట్‌ పరంగాగానీ,  హైదరాబాద్‌లో ఉన్న అందమైన లొకేషన్స్‌ పరంగా గాని, హాస్పటాలిటీట్‌ గురించి గాని, షూటింగ్‌ను కూడా బ్రంహ్మాండంగా జరిగే విధంగా మాట్లాడుకుందామని అన్నారు. మంచి వాతావరణంలో ఉన్న హైదరాబాద్‌ హెరిటేజ్‌ బిల్డింగ్స్‌, అకామిడేషన్‌గాని, తెలంగాణ చార్మినార్‌, గోల్కొండ కోట, కాకతీయ ఇలా...ఈ విధంగా అనేకమైనటువంటి ప్రాంతాల్లో షూటింగ్స్‌ జరుగుతున్నాయి. చాలా వరకు ఇక్కడ ఫారెస్ట్‌ కూడా ఉంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని సినిమా రంగాన్ని ఇంకా అభివృద్ధి చేయాలనే ఉద్ధేశ్యంతో సీఎంగారు చాలా ఇంట్రస్ట్‌గా ఉన్నారు. అయితే పెద్దలందరికీ రిక్వెస్ట్‌ ఇంకా అభివృద్ధి చేయాలనే తంపుతో ఉన్నాను. నేను డెఫినెట్‌గా అన్నీ చేస్తానని తలసాని చెప్పారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs