Advertisement
Google Ads BL

లక్ష్మీ రావే..కి భారీ ఆఫర్..!


నాగశౌర్య హీరోగా అవికాగోర్ హీరోయిన్ గా నటించిన చిత్రం 'లక్ష్మీ రావే మాఇంటికి' ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రాన్ని గిరిధర్ ప్రొడక్షన్స్ పతాకంపై ఫిల్మ్ జర్నలిస్ట్ గిరిధర్ మామిడిపల్లి నిర్మించిన సంగతి తెలిసిందే. రెండు వారాల కిందట రిలీజ్ అయిన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ఇటీవలే అమ్ముడయ్యాయి. జీటీవీ వారు ఈ రైట్స్ ను మంచి రేటుకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ ఫాన్సీరేట్ ను దక్కించుకోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది . ఉయ్యాలా.. జంపాల ఫేమ్ అవికాగోర్ హీరోయిన్ గా నటించడంతో ఇంత మంచి రేటుకు అమ్ముదయిందని అంటునారు. అవికాగోర్ కు టీవీ మీడియాలో ఉన్న క్రేజ్ తో టీఆర్పీలు బాగా వస్తాయని భావించడమే దీనికి కారణం అని తెలుస్తోంది. కాగా ఈ చిత్రం ద్వారా నంద్యాల రవి దర్శకునిగా పరిచయం అయ్యాడు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs