Advertisement
Google Ads BL

సూర్యాపేట జంక్షన్ సినిమా రివ్యూ


సూర్యాపేట జంక్షన్ సినిమా రివ్యూ  

Advertisement
CJ Advs

సూర్యాపేట జంక్షన్ మూవీ పొలిటికల్ కామెడీ డ్రామా. ఈశ్వర్‌, నైనా సర్వర్‌ జంటగా నటించిన మూవీ సూర్యాపేట్‌ జంక్షన్‌. యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై అనీల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్ శ్రీనివాసరావు, నిర్మాణంలో, రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో ఈశ్వర్, నైనా సర్వర్, అభిమన్యు సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఈ రోజు (శుక్ర‌వారం) విడుదల అయింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.

కథ:

స్టూడెంట్ అర్జున్‌ (ఈశ్వర్) తన నలుగురు స్నేహితులతో కలిసి జాలిగా తిరుగుతూ కాలక్షేపం చేస్తుంటాడు. ఈ క్రమంలో జ్యోతి (నైనా సర్వర్) ప్రేమలో పడతాడు. మరోవైపు నరసింహ (అభిమన్యు సింగ్) ఎమ్మెల్యే కావాలనుకుంటూ, పేదల ఓట్ల కోసం ఉచితాల పథకాల పేరుతో ఓ కుట్రను అమలు చేస్తాడు. కానీ, అర్జున్‌ గ్యాంగ్‌లో ఒకరైన శీను అనుమానాస్పద పరిస్థితుల్లో హత్యకు గురవుతాడు. శీనును ఎవరు చంపారు? ఆ ఘటన వెనక ఉన్న రాజకీయ కుట్ర ఏంటి? ఉచిత పథకాల వెనుక ఉన్న అసలు మురికి ఏంటి? అనే ప్రశ్నలకు సినిమా మెల్లగా సమాధానాలు ఇస్తూ, ఆధ్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. 

నటీనటులు:

ఈశ్వర్ అర్జున్ పాత్రలో తన యాక్షన్, డాన్స్, ఫైటింగ్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించాడని చెప్పొచ్చు. టాలీవుడ్‌లో స్టార్ హీరో రేంజ్‌కు చేరుకుంటాడ‌ని ఈ సినిమాతో ఫ్రూవ్ చేసుకున్నాడు 

నైనా సర్వర్ జ్యోతి పాత్రలో చక్కగా నటించింది. అందం, అభినయం రెండింటితో ఆకర్షించింది.  

అభిమన్యు సింగ్ నరసింహ పాత్రలో దుష్టుడిగా మెప్పించాడు.  

సంజయ్ విలన్ కర్ణ పాత్రలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు.  

రాజేష్, సూర్య, శీను, టోనీ – ఫ్రెండ్స్ పాత్రల్లో కామెడీకి నావిగేషన్ చేయగా, చమ్మక్ చంద్ర, చలాకీ చంటి వంటి కామెడీ ఆర్టిస్టులు నవ్వులు పూయించారు.

సాంకేతిక విశ్లేషణ:

దర్శకత్వం: ఈశ్వర్ రాసిన కథను రాజేష్ నాదెండ్ల బాగా తీర్చిదిద్దాడు. యాక్షన్-కామెడీ మిక్స్‌ను బాగా మేనేజ్ చేశాడు.  

కెమెరా వర్క్: అరుణ్ ప్రసాద్ క్యామరా పనితీరు సినిమాకు ప్లస్ అయింది. ప్రతి ఫ్రేమ్ విజువల్‌గా బావుంది.  

సంగీతం: రోషన్ సాలూరి, గౌర హరి ఇచ్చిన సంగీతం బాగా ఆకట్టుకుంది. "మ్యాచింగ్ మ్యాచింగ్" పాట యూత్‌ను ఊపేసేలా ఉంది. మూడు పాటలు, ఒక ఐటెమ్ సాంగ్ కథలో భాగమై సినిమాకు బలాన్ని ఇచ్చాయి.  

ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్: ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాణ విలువలతో సినిమా రూపొందించారు నిర్మాతలు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయిందని చెప్పొచ్చు.

హైలైట్స్:

ప్రభుత్వ ఉచిత పథకాల వెనుక ఉన్న రాజకీయ డ్రామా ఓ నూతన కోణంలో చూపించిన విధానం బాగుంది.  

యూత్‌కు దగ్గరయ్యేలా రొమాన్స్, కామెడీ, యాక్షన్ మిశ్రమంగా ఉంది.  

క్లైమాక్స్ లో రోమాలు నిక్క‌బొడిచేలా ఉంటుంది.  

ప్ర‌భుత్వాల ఉచితాలు ప్ర‌జ‌లను ఎలా ఉరితీస్తాయో అనే చెదు నిజాల‌ను చూపించింది ఈ ‘సూర్యాపేట జంక్షన్’. డైరెక్టర్ రాజేష్ నాదెండ్ల తెర‌కెక్కించిన ఈ పాలిటికల్ కామెడీ డ్రామా.. వినోదానికి, సందేశానికి సమతుల్యతను అందించిన మంచి ప్రయత్నంగా నిలిచింది. ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై అనీల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్ శ్రీనివాసరావు ఎంతో క్వాలిటీగా నిర్మించారు. ఒక వినోదాత్మకమైనా, ఆలోచన కలిగించే సినిమాగా చెప్పుకోవ‌చ్చు. పాలిటికల్ డ్రామాలో కొత్త కోణం, యూత్‌కు కనెక్ట్ అయ్యే కథనం, బలమైన టెక్నికల్ వర్క్ ఈ సినిమాను మినిమమ్ గ్యారంటీ హిట్ లా నిలిపాయి. ఓ వినోదంతో పాటు ఓ మెసేజ్ కూడా కావాలనుకునే ప్రేక్షకులకు తప్పక చూడాల్సిన సినిమా ఇది.

ఫైనల్ వెర్డిక్ట్:  

ఉచితాల వెనుక ఉన్న రాజకీయాలపై ఓ శక్తివంతమైన పంచ్… వినోదంతోపాటు సందేశం కూడా కావాలంటే సూర్యాపేట జంక్షన్ ను మిస్ కావద్దు!

రేటింగ్: 2.25/5

Suryapet Junction Movie Review:

Suryapet Junction Telugu Movie Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs