హవ్వ! అని షాక్ తినే ఘటన ఇది. ఈ లోకంలో మగాళ్లకు కూడా రక్షణ లేని దుస్థితి!! కమిట్ మెంట్ కేవలం నటీమణులకే కాదు.. మగ నటులకు తప్పదు! అని ఈ ఘటన చెబుతోంది. తాజాగా పాపులర్ రియాలిటీ షో నటుడు ఒకరు తనకు ఎదురైన అనుభవం చెప్పుకుని బావురుమన్నాడు. తనను రూమ్ కి పిలిచి ఫైనల్లో గెలవాలంటే కమిట్ మెంట్ ఇవ్వాలని కామాంధుడైన నిర్మాత అడిగారని అతడు వాపోయాడు. సోషల్ మీడియాలో అతడు తనకు జరిగిన వేధింపుల ఘటనను పోస్ట్ చేయడం షాకిచ్చింది.
వివరాల్లోకి వెళితే.. హుమారి బహు సిల్క్, మద్దం సర్ వంటి టీవీ షోలలో నటించిన ఇమ్రాన్ నజీర్ ఖాన్ కి ఇలాంటి నరకం ఎదురైంది. సన్నీ లియోన్ హోస్ట్‌గా ఉండే తన తదుపరి రియాలిటీ షో `రియల్‌మ్యాన్ అన్‌లీషెడ్` నిర్మాత తనను రూమ్ కి పిలిచి కమిట్ మెంట్ అడిగాడని అతడు బయటపెట్టాడు. జూమ్ -టెల్లీ టాక్ ఇండియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రియాలిటీ షో నిర్మాత మహమ్మద్ నాగమాన్ భోగోతాన్ని బయటపెట్టాడు. ఈ షో గెలవడానికి తనను రాజీ పడమని కోరినట్లు ఇమ్రాన్ వెల్లడించాడు. నిర్మాత తన కెరీర్‌ను నాశనం చేస్తానని బెదిరించాడని, ఫైనల్ ముగింపుకు ముందే తనను బహిష్కరించాలని ప్లాన్ చేశాడని తీవ్రంగా ఆరోపించాడు.
అసలేం జరిగిందో వివరంగా వెల్లడించాడు ఇమ్రాన్. జీ5లో షో కోసం నిర్మాత నన్ను సంప్రదించాడు. షోలో 16 మంది అబ్బాయిలు ఉన్నారు. హాస్టల్‌కు వెళ్ళిన తర్వాత నిర్మాత నేరుగా గదిలోకి వచ్చి అబ్బాయిలను డిన్నర్‌కు తీసుకెళ్లడం, సిగరెట్ బ్రేక్‌లు తీసుకోవడం వంటివి నేను చూశాను. ఒక రాత్రి అతడు నన్ను తన గదిలోకి పిలిచి, `నీకు అభ్యంతరం లేకపోతే, షో కోసం ``అందుకు రాజీ పడతావా?`` అని అడిగాడు. నేను పూర్తిగా షాక్‌లో ఉన్నాను. నేను వెంటనే అతడికి నో చెప్పాను. అప్పటికే నేను షో కోసం షూటింగ్ చేసాను. కానీ నిర్మాత నాకు వ్యతిరేకంగా ప్లాన్ చేశాడు. అతడు మొదట్లో నన్ను షో నుండి బయటకు పంపాడు.. కానీ క్రియేటివిటీ టీమ్ నన్ను మళ్ళీ సరదాగా తీసుకువెళ్లింది`` అని తెలిపాడు.
చివరిగా షోలో బాగా నటించాను కానీ మేకర్ నన్ను విజేతను చేయకూడదని కక్ష కట్టాడు. అతను షాదన్ ఫరూకీని షో విజేతను చేశాడు. రియల్ మ్యాన్ అన్‌లీషెడ్ మోసపూరితమైనది. నేను నా హక్కుల కోసం పోరాడినప్పుడు, మహమ్మద్ నాగమాన్ నా కెరీర్‌ను నాశనం చేస్తానని బెదిరించాడు. షో విజేత సహా దాదాపు అందరు పోటీదారులతోను ఇలానే చేశాడు. నేను వారి పేర్లను వెల్లడించలేను.. అని తెలిపాడు. సన్నీలియోన్ షోని హోస్ట్ చేస్తుందని చెప్పినా కానీ గ్రాండ్ ఫినాలేకి మాత్రమే వచ్చిందని, తాను నిరాశ చెందానని ఇమ్రాన్ వెల్లడించాడు. ఇమ్రాన్ నజీర్ ఖాన్ గతంలో అభయ్, గత్బంధన్, హుమారి బహు సిల్క్, అలాద్దీన్, మై హూన్ అపరాజిత వంటి షోలలో నటించాడు.