Advertisement
Google Ads BL

వక్ఫ్ చట్ట సవరణకు టీడీపీ మద్దతు


వివాదాస్పద వక్ఫ్ చట్ట సవరణ బిల్లును మరోసారి పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్దమైంది. అందులో భాగంగా ఈరోజు పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో రేపు లోక్ సభలో వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు ఎన్డీయే మిత్రపక్షమైన టీడీపీ మద్దతు ప్రకటించింది. లోక్ సభలో ప్రవేశపెట్టే వక్ఫ్ బిల్లుపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రేమ్ కుమార్ జైన్ తమ అభిప్రాయం వెల్లడించారు. వక్ఫ్ బిల్లుకు తాము మద్దతిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ముస్లింల ప్రయోజనాల కోసం పనిచేస్తారని పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారని, కాబట్టి రేపు బిల్లు ప్రవేశపెట్టాక తమ పార్టీ అభిప్రాయం స్పష్టంగా వెల్లడిస్తామన్నారు. చంద్రబాబు మాత్రం ముస్లింలకు అండగా ఉంటారని ఆయన తెలిపారు.

Advertisement
CJ Advs

వక్ఫ్ సవరణ బిల్లులో టీడీపీ చేసిన 4 సవరణలలో 3 ఆమోదించబడ్డాయి !

1. యూజర్ ద్వారా వక్ఫ్ - పునరాలోచన కాదు.

(దీని అర్థం ఇప్పటికే వక్ఫ్ బై యూజర్ గా నమోదు చేయబడిన వక్ఫ్ ఆస్తుల కేసులు తిరిగి తెరవబడవు మరియు వాటికి వక్ఫ్ డీడ్ లేకపోయినా వక్ఫ్ ఆస్తులుగానే ఉంటాయి) 

2. కలెక్టర్ తుది అధికారం కాదు.  

3. డిజిటల్‌గా పత్రాలను సమర్పించడానికి 6 నెలల గడువు పొడిగింపు.

ఈ పై 3 సవరణలూ ఆమోదించబడ్డాయి... నాలుగవ అమెండ్మెంట్  

వక్ఫ్ ఆస్తులలో నాన్ ముస్లింల ప్రమేయం గురించి.

హిందూ దేవాలయాల విషయంలో వేరే మతస్థుల ప్రమేయాన్ని ఎలా అయితే ఒప్పుకోరో...  

ముస్లింలు వాళ్ళ మత వ్యవహారాలలో ముస్లిమేతరుల యొక్క ప్రమేయాన్ని ఒప్పుకోరు.. 

టీడీపీ మొదటి నుంచి దీని మీద గట్టిగా పోరాడుతుంది, ఈ విషయంలో ముస్లిం సమాజం కూడా గట్టిగా పోరాడాల్సి ఉంది. 

అయితే ఇక్కడగమనించాల్సిన విషయం ఏమిటంటే.. వక్ఫ్ సవరణ చట్టంపై వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ ఇప్పటి వరకూ ఏ ఒక్క సవరణ కానీ డిమాండ్ కానీ చేయకపోవడం... ముస్లిం సమాజం గమనించాలి. 

TDP to support Waqf Bill:

TDP says party will support Waqf Amendment bill 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs