Advertisement
Google Ads BL

భగీరథకు కళారత్న అవార్డు


ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు సీనియర్ జర్నలిస్ట్, రచయిత భగీరథకు కళారత్న అవార్డు ను  ప్రదానం చేశారు.   

Advertisement
CJ Advs

ఉగాది రోజు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఉగాది అవార్డుల కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న చంద్రబాబు నాయుడు గారు భగీరథకు  కళారత్న అవార్డును  బహుకరించి అభినందించారు. 

మండలి బుద్ధ ప్రసాద్ చైర్మన్ గా ఏర్పాటైన కమిటీ 2025 సంవత్సరానికి కళారత్న, ఉగాది పురస్కారాలకు పలువురు ప్రతిభావంతులను ఎంపిక చేసింది. సీనియర్ జర్నలిస్టు, రచయిత, కవి అయిన భగీరథను కళారత్న అవార్డుకు ఎంపిక చేసింది. 

ఈ కార్యక్రమం లో దేవాదాయ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, కల్చరల్ కమిటీ చైర్మన్ తేజస్వి పొడపాటీ, నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 భగీరథ మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మకమైన కళారత్న అవార్డు జర్నలిజం లో తాను చేసిన కృషిని గుర్తించి ఎంపిక చేశారని , తనకు ఎంతో  ఆనందంగా ఉందని, ఈ  సందర్భంగా ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు గారికి, అవార్డుల కమిటీ చైర్మన్ మండలి బుద్ధ ప్రసాద్ గారికి, ఎన్ .టి .ఆర్. సెంటినరీ కమిటీ చైర్మన్ టి .డి .జనార్దన్ గారికి, నాటక రంగ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ గారికి  కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని భగీరథ చెప్పా

Journalist Bhageeratha to receive KalaRatna award:

Bhagiratha gets Kala Ratna award
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs