Advertisement
Google Ads BL

పసుపు మయంగా మారిన గజపతినగరం


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మినిస్టర్ నారా లోకేష్, టీడీపీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు 43 వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవ రోజున కార్యకర్తలు, అభిమానులు సేవా కార్యక్రమాలు, రక్తదాన శిభిరాలు, సామూహిక అన్నదాన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు టీడీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. 

Advertisement
CJ Advs

మంగళగిరి టీడీపీ పార్టీ ఆఫీసులో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహానికి  పూలమాల వేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రసంగించారు. అంతేకాదు టీడీపీ నేతలు, మంత్రులు సైతం పెద్ద ఎత్తున తమ తమ నియోజకవర్గాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా ఉత్తరాంధ్రలో యువ మంత్రి, గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్.. వేడుకలను ముందుండి నడిపించారు. 

గజపత నగరం నియోజకవర్గంలో టీడీపీ ఆఫీసులో జెండా ఆవిష్కరణ కార్యక్రమంతో పాటుగా పలు కార్యక్రమాల్లో మంత్రి శ్రీనివాస్ పాల్గొన్నారు. పార్టీ నేతలతో, కార్యకర్తలతో ఆయన స్వయంగా మాట్లాడిన మంత్రి.. దిశా నిర్దేశం చేస్తూ, గ్రామ స్థాయిలో కార్యక్రమాలను ముందుండి నడిపించారు. మంత్రి పిలుపుతో పాటుగా స్వచ్చందంగా ముందుకు వచ్చిన కార్యకర్తలు.. నాయకత్వం కొన్ని గ్రామాల్లో ముందస్తు షెడ్యూల్ కారణంగా అందుబాటులో లేకపోయినా, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు. 

అంతేకాకుండా తను బిజీ  షెడ్యూల్స్ లో ఉండి హాజరు కాలేకపోయిన కార్యక్రమాలను నిర్వహించిన కార్యకర్తలతో, నాయకులతో స్వయంగా ఫోన్ లో మాట్లాడిన మంత్రి, పార్టీ ఆవిర్భావవేడుకలను ఘనంగా నిర్వహించినందుకు గాను పలువురిని అభినందించారు. పార్టీ కార్యక్రమాలకు ఈ మధ్య దూరంగా ఉన్న నాయకులు కూడా మంత్రి పిలుపుతో ముందుకు వచ్చారు. ఇక ఉత్తరాంధ్రలో ఇతర నాయకులు సైతం వేడుకలను ఘనంగా నిర్వహించారు. 

TDP foundation day:

TDP to celebrate 43rd foundation day 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs