Advertisement
Google Ads BL

బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఛావా హవా


టాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో గ్లామరస్ హీరోయిన్ రష్మిక మందన్నా కథానాయికగా నటించిన చిత్రం ఛావా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. హిందీ భాషలో మాత్రమే విడుదలైన ఈ చిత్రం ఇండియా వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

Advertisement
CJ Advs

ఈ సినిమా ఇప్పటికే ₹300 కోట్ల మార్క్ దాటిపోయింది. విడుదలైన రెండు వారాలైనా వసూళ్లలో ఎలాంటి తగ్గుదల లేకుండా ప్రతి వర్కింగ్ డే కూడా స్ట్రాంగ్ హోల్డ్‌తో దూసుకెళ్తోంది.  సోమవారం కూడా అద్భుతమైన వసూళ్లు రాబట్టింది. ఒక్క రోజులోనే ₹19 కోట్లు పైగా నెట్ వసూళ్లను సాధించి మొత్తం కలెక్షన్ ₹353 కోట్లకు చేరుకుంది. ఈ గణాంకాలతో ఈ చిత్రం త్వరలోనే ₹400 కోట్ల క్లబ్‌లో చేరనుందనే అంచనాలు నెలకొన్నాయి.

ఈ గ్రాండ్ హిస్టారికల్ డ్రామాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా మాడాక్ ఫిల్మ్స్ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. భారీ నిర్మాణ విలువలతో రూపొందిన ఈ చిత్రం బాలీవుడ్‌లో మరో ఘన విజయంగా నిలిచింది.

Chhaava collections report:

Chhaava enters 300 cr club
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs