ఈరోజు సడన్ గా మెగాస్టార్ తల్లి అంజనాదేవి ఆరోగ్యం బాగాలేదు, దానితో ఆమెను హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు అంటూ పలు మీడియా సంస్థల్లో వస్తోన్న కథనాలపై మెగాస్టార్ చిరంజీవి రియాక్ట్ అయ్యారు.
మా అమ్మ అస్వస్థతగా ఉందని, ఆసుపత్రిలో చేరిందని కొన్ని మీడియా కథనాలపై నా దృష్టి పడింది.
రెండు రోజులుగా ఆమె కాస్త అస్వస్థతకు గురైందని వైద్యులు చెప్పారు
ఆమె ఇప్పుడు హుషారుగా మరియు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది.
ఆమె ఆరోగ్యంపై ఎలాంటి ఊహాజనిత నివేదికలను ప్రచురించవద్దని అన్ని మీడియాలకు విజ్ఞప్తి..అంటూ చిరు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసారు.