Advertisement
Google Ads BL

బాలయ్య-మెగా కాంపౌండ్ పై చిరు కామెంట్స్


మెగాస్టార్ చిరంజీవి ఈరోజు జరిగిన విశ్వక్ సేన్ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా వెళ్లారు. ఈవెంట్ లో చిరు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇలాంటి ఈవెంట్స్ కి రావడం వల్ల ఇక్కడున్న ఎనర్జీ నాకు ఎంతో ఉత్సాహం ఇస్తుంది. ఇంత ఎనర్జీ ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విశ్వక్ సేన్ ఫంక్షన్ కి వెళ్తున్నావా? అని అడిగారు. ఏం ఎందుకు వెళ్ళకూడదు? అతను మన మనిషి కాదు.. బాలకృష్ణ.. అప్పుడప్పుడు తారక్ అంటాడు. అంటే మనుషులంటే వేరే వాళ్ళ మీద అభిమానం ప్రేమ ఉండకూడదా?  మా ఇంట్లోనే మా అబ్బాయికి సూర్య అంటే చాలా ఇష్టం. అంత మాత్రాన వాడి ఫంక్షన్ కి నేను వెళ్ళకూడదా?

Advertisement
CJ Advs

 విశ్వక్ కి ఈ ప్రశ్న అడగడం నేను చూశాను. దానికి విశ్వక్ చాలా చక్కని సమాధానం చెప్పాడు. మా ఇంటికి కాంపౌండ్ ఉంటుంది కానీ సినిమా ఇండస్ట్రీకి కాంపౌండ్ లేదు అన్నాడు. నిజంగా తనని అభినందిస్తున్నాను. అభిమానులు వాల్ పోస్టర్లు చింపుకోవడం నేను చూశాను. నెల్లూరు లో మా కజిన్స్ ఒకరు రామరావు గారిని, ఒకరు ఏఎన్ఆర్ గారి అభిమానించి ఒకరిని ఒకరు కొట్టుకునేవారు. హీరోలు బాగానే వుంటారు. అభిమానులు కొట్టుకుంటున్నారనే ఆలోచన ఆ రోజు నుంచే నాకు మొదలైయింది.  

నేను ఫిల్మ్ యాక్టర్ అయిన తర్వాత హీరోల మధ్య సక్యత సహ్రుద్బావ వాతావరణం ఏర్పాటు చేయాలని బలంగా కోరుకున్నాను. మద్రాస్ లో హనీ హౌస్ లో అందరం కలిసి పార్టీలు చేసుకునే వాళ్ళం. ఈ రోజుకి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున మేమంతా కలసికట్టుగా వుంటాం. బాలయ్య 50 ఇయర్స్ వేడుకకు నేను వెళ్లాను. మా మధ్య ఎలాంటి అరమరికలు లేవు. అందరం కలివిడిగా వుండాలి. పుష్ప 2 పెద్ద హిట్ అయ్యింది. దానికి నేను గర్విస్తాను. ఇండస్ట్రీలో ఒక సినిమా ఆడింది అంటే అందరం ఆనందం పడాలి. ఆ ఆనందం ఇవ్వడానికి ఈ వేడుకకు వచ్చాను. ఇండస్ట్రీ ఒకటే  కాంపౌండ్. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఎక్కడో అనగారిపోయిన కోరిక గబుక్కున పెళ్ళుబికింది. 

లైలా గెటప్ లో విశ్వక్ కసక్ లా అనిపిస్తున్నాడు(నవ్వుతూ). విశ్వక్ నిజంగా ఆడపిల్ల అయివుంటే గుండెజారి గల్లంతయ్యేది(నవ్వుతూ). అంతగ్లామర్ గా వున్నాడు. నేను, నరేష్, రాజేంద్ర ప్రసాద్ లేడి గెటప్స్ వేశాం. ఆ సినిమాలన్నీ హిట్ అయ్యాయి. లైలా కూడా హిట్ గ్యారెంటీ. తప్పకుండ ఈ సినిమాకి ఆడియన్స్ వెళ్తారు. ఎంజాయ్ చేస్తారు. విశ్వక్ మాస్ క్లాస్ ఇటు అమ్మాయిగా అద్భుతంగా చేశాడు. దర్శకుడు రామ్ చాలా ఎంటర్ టైన్మెంట్ తో తీశాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్.  విశ్వక్ చాలా ప్రతిభావంతుడు. తన ఇండస్ట్రీలో జెండా పాతాలి. ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాతో మగవాళ్ళ గుండెల్లో  స్థానం సంపాదించుకుంటాడు. అభిమన్యు సింగ్, పృద్వీ, ఆకాంక్ష, కామక్షి అందరూ చక్కగా పెర్ఫార్ చేశారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్.. అంటూ ముగించారు. 

Chiru comments on Balayya-Mega Compound:

Chiranjeevi at Laila Pre Release Event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs