Advertisement
Google Ads BL

రవితేజ మాస్ జాతర నిజంగా జాతరే


మాస్ మహారాజా రవితేజ హీరోగా ఆయన కెరీర్ లోనే ప్రతిష్టాత్మక 75వ చిత్రంగ గా మాస్ జాతర తెరకెక్కుతుంది. భాను భోగవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ఆకట్టుకోగా.. ఈరోజు రవితేజ బర్త్ డే సందర్భంగా మాస్ జాతర గ్లింప్స్ ను చిత్ర బృందం విడుదల చేసింది. 

Advertisement
CJ Advs

జనవరి 26వ తేదీన రవితేజ పుట్టినరోజు సందర్భంగా మాస్ జాతర గ్లింప్స్ విడుదలైంది. ఈ గ్లింప్స్ లో మునుపటి అసలు సిసలైన మాస్ మహారాజా రవితేజను గుర్తు చేసేలా ఉంది. తనదైన కామెడీ టైమింగ్, విలక్షణ డైలాగ్ డెలివరీ మరియు ఎనర్జీకి పెట్టింది పేరు రవితేజ. అందుకే ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుంటాయి. 

రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విందు భోజనం లాంటి మాస్ ఎంటర్టైనర్ గా మాస్ జాతర రూపొందుతోందని గ్లింప్స్ ను చూస్తే అర్థమవుతోంది. రవితేజ కెరీర్ లో మనదే ఇదంతా అనే డైలాగ్ ఎంతటి ప్రాముఖ్యత పొందినదో తెలిసిందే. గ్లింప్స్‌ కు ఈ డైలాగ్ హైలెట్ అయ్యింది. ఇది అభిమానులను మళ్ళీ ఆ రోజులకు తీసుకొని వెళ్తుంది. అలాగే నేటి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది.

దర్శకుడు భాను బోగవరపు మాస్ ప్రేక్షకులు మెచ్చే విధంగా ఆకర్షణీయంగా మాస్ జాతర గ్లింప్స్‌ ను మలిచారు. మాస్ మహారాజాగా రవితేజ మాస్ ప్రేక్షకులకు ఎందుకు అంతలా చేరువయ్యారో ఈ గ్లింప్స్‌ మరోసారి రుజువు చేస్తోంది. సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో అందించిన నేపథ్య సంగీతం, రవితేజ ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా ఉండటమే కాకుండా, గ్లింప్స్‌ కు ప్రధాన బలంగా ఉంది.

Mass Jathara Glimpse Out:

Ravi Teja Mass Jathara Glimpse Out
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs