Advertisement
Google Ads BL

మైక్రో సాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో బాబు-లోకేష్


గత రెండురోజులుగా ఏపీ సీఎం చంద్రబాబు, రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఇంకా టీడీపీ మంత్రులు, నేతలు కొంతమంది దావోస్ పర్యటనలో ఏపీకి పరిశ్రమల కోసం పెట్టుబడిదారులను ఆకర్షించే పనిలో బిజీగా వున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రిలను కలవడం, ఇంకా ప్రపంచ దిగ్గజ వ్యాపారవేత్తలను మీట్ అవుతూ బిజీగా కనబడుతున్నారు. 

Advertisement
CJ Advs

తాజాగా మైక్రో సాఫ్ట్ అధినేత, ప్రపంచ ఐటి దిగ్గజం బిల్ గేట్స్ తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ ప్రొమెనేడ్ మైక్రోసాఫ్ట్ కేఫ్ లో భేటీ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తమపై నమ్మకంతో మైక్రోసాఫ్ట్ ఐటి కేంద్రాన్ని నెలకొల్పడంతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయిన విషయాన్ని బిల్ గేట్స్ కు చంద్రబాబు గుర్తుచేశారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఎపిలో ఐటి అభివృద్ధికి సహాయ, సహకారాలను అందించాలని మంత్రి నారా లోకేష్ కోరారు. ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటుచేయబోతున్న వరల్డ్ క్లాస్ ఎఐ యూనివర్సిటీ సలహామండలిలో భాగస్వామ్యం వహించండి. 

మీ అమూల్యమైన సలహాలు మా రాష్ట్రంలో ఐటి అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఎపిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్స్‌ను ఏర్పాటు చేయడానికి బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరపున ఎపి ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించండి. రాష్ట్రంలోని ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ ఎకోసిస్టమ్‌ను నడపడానికి ఆఫ్రికాలో హెల్త్ డ్యాష్‌బోర్డ్‌ల తరహాలో సామాజిక వ్యవస్థాపకతలో ఫౌండేషన్ తరపున నైపుణ్య సహకారాన్ని అందించండి. దక్షిణ భారతంలో బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలకు ఎపిని గేట్‌వేగా నిలపండి. మీ సహకారంత స్థానికంగా ఉత్పత్తులపై ప్రపంచ ఆవిష్కరణలను అమలు చేసేలా ఎపి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు. విజనరీ లీడర్ చంద్రబాబును చాలాకాలం తర్వాత కలవడం ఆనందంగా ఉంది, ఎపి ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బిల్ గేట్స్ చెప్పారు.

AP CM Chandrababu Naidu Meets Bill Gates:

Chandrababu Naidu to meet Bill Gates at WEF 2025
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs