మహానటి కీర్తి సురేశ్ గత ఏడాది డిసెంబర్ 12 తన బెస్ట్ ఫ్రెండ్ ఆంటోనీని అంగరంగ వైభవముగా గోవాలో హిందూ, క్రిష్టియన్ సాంప్రదాయ పద్దతిలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత పెద్దగా రిలాక్స్ అవ్వకుండానే కీర్తి సురేష్ హిందీ లోకి డెబ్యూ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బేబీ జాన్ ప్రమోషన్స్ లో తేలింది.
పెళ్లి తర్వాత గ్లామర్ డ్రెస్సులతో మెస్మరైజ్ చేసిన కీర్తి సురేష్ మెడలో లో తాళిబొట్టుతో అంటే పసుపుతాడు తోనే అందాల ప్రదర్శన చేసింది. బేబీ జాన్ రిజల్ట్ ఎలా ఉన్నా కీర్తి సురేష్ మాత్రం బాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పడింది. ఇక న్యూ ఇయర్ కి మాత్రం భర్త ఆంటోనీతో సెలెబ్రేట్ చేసుకున్న కీర్తి సురేష్ మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టీవ్ అయ్యింది.
తాజాగా గ్రీన్ చుడిదార్ పిక్స్ ని షేర్ చేసింది. మెడలో ఇంకా పసుపు తాడుతోనే కనిపించిన కీర్తి సురేష్ ఆ గ్రీన్ చుడిదార్ లో మాత్రం బ్యూటిఫుల్ గా కనిపించింది. ఫ్యామిలీ, ఇంకా ఫ్రెండ్స్, భర్త ఆంటోనీతో కలిసి సరదాగా కలిపించిన కీర్తిని చూసిన నెటిజెన్స్ ఇంకా తాళిమార్చలేదనుకుంటా కీర్తి సురేశ్ పసుపుతాడుతోనే గ్రీన్ చుడిదార్ లో చాలా బ్రైట్ గా మెరిసిపోతూ కనిపించింది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.