Advertisement
Google Ads BL

బాలకృష్ణ-తమన్- బాక్సులు బద్దలు కొట్టే ద్వయం


గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతున్నారు. రీసెంట్‌గా వచ్చిన డాకు మహారాజ్ ఏకంగా నాలుగు రోజుల్లోనే వంద కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఇలా వరుసగా నాలుగు చిత్రాలు వంద కోట్ల మార్క్‌ను క్రాస్ చేయడంతో బాలకృష్ణ తన కెరీర్‌లో అరుదైన రికార్డ్ సృష్టించినట్టు అయింది. అయితే ఈ చిత్రాలన్నీ కూడా తమన్ సంగీత సారథ్యంలో రావడం మరొక విశేషం.

Advertisement
CJ Advs

బాలయ్య బాబు, తమన్ కలిసి వస్తున్నారంటే బాక్సాఫీస్ రికార్డులు షేక్ అవుతాయని అర్థం. ఇప్పటికే వీరి కాంబోలో అఖండ, వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి ఇలా మూడు బ్లాక్ బస్టర్లతో హ్యాట్రిక్ కొట్టేశారు. ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ అంటూ మరోసారి బాలకృష్ణ, తమన్ తమ కాంబోలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు.

బాలకృష్ణ, తమన్ కాంబోలో సినిమా వస్తోందంటే థియేటర్ యాజమాన్యాలు కూడా భయపడిపోతున్నాయి. ఎక్కడ తమ సౌండ్ బాక్సులు  బద్దలు అవుతాయో అని కంగారు పడుతున్నారు. ఇక మాస్ ఆడియెన్స్‌ అయితే వీరి కాంబోకి పూనకాలు వచ్చేసి ఊగిపోతున్నారు. డాకు మహారాజ్ ప్రమోషన్స్‌లో భాగంగా ‘బక్కోడికి రజిని బండోడికి బాలయ్య’ అంటూ తమన్ చెప్పిన ఓ డైలాగ్ బాగానే వైరల్ అయింది. 

ప్రస్తుతం బాలకృష్ణ 2.0 నడుస్తోంది. ఇకపై తానేంటో మున్ముందు చూస్తారని బాలకృష్ణ చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరి కాంబోలో అఖండ 2 రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రంపై ఆకాశమంత ఎత్తులో అంచనాలు ఉన్నాయి. మహా కుంభమేళాలో ఈ మూవీ షూటింగ్‌ను బోయపాటి శ్రీను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. ఇక అఖండ 2తో తమన్ మరోసారి బాక్సులు బద్దలు కొట్టేందుకు రెడీ అవుతున్నారు.

NBK and Thaman - The Mass Destruction Duo :

NBK and Thaman 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs