సేఫ్ గేమ్ ఆడాలంటే అనిల్ ని ఎంచుకోండి
సీనియర్ హీరోలైనా, యంగ్ హీరోయినా సేఫ్ గా ఆడియన్స్ ముందుకు రావాలి, ఎబో యావరేజ్ హిట్ అందుకోవాలి అంటే అనిల్ రావిపూడిని దర్శకుడిగా ఎంచుకోండి అంటూ ప్రేక్షకులు సలహాలు ఇస్తున్నారు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా అనిల్ రావిపూడి మొదటి సినిమా నుంచి నిన్నమొన్నటి భగవంత్ కేసరి వరకు అన్ని సక్సెస్ సాధించినవే.
బ్లాక్ బస్టర్ కాకపోయినా.. మంచి హిట్స్ ఆయా హీరోలు తమ ఖతాలో వేసుకున్నారు. అనిల్ రావిపూడి అంటే సేఫ్ హ్యాండ్ అనే మాట బాగా బాగా వైరల్ అయ్యింది. అందుకే సీనియర్ హీరోలైన బాలయ్య చిరు కూడా అనిల్ అవిపూడికి అవకాశాలిచ్చారు. తాజాగా వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం ఈ సంక్రాంతి రోజు విడుదలవుతుంది.
సంక్రాంతికి వస్తున్నాం నిజంగా పండగ కళ కనిపించే సినిమా. ఈ చిత్రం ఈ సంక్రాంతి విన్నర్ గా నిలవబోతుంది అంటూ వెంకీ ఫ్యాన్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సెప్టెంబర్లో మొదలెట్టి ఈ సంక్రాంతికి సినిమాని విడుదల చేసేస్తున్న అనిల్ రావిపూడి స్పీడుకి ఫిదా కావాల్సిందే. అందుకే సేఫ్ గేమ్ ఆడాలంటే అనిల్ రావిపూడిని ఎంచుకోండి అంటూ నెటిజెన్స్ సలహాలు ఇస్తున్నారు.