వినయ విధేయరామ లాంటి డిజాస్టర్ లో రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ కియారా అద్వానీ మరోసారి రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ లలో కలిసి కనిపించనుంది. గేమ్ ఛేంజర్ సాంగ్స్ లో కియారా అద్వానీ గ్లామర్ హైలెట్ అయ్యింది, అంతేకాదు కియారా పాత్ర చాలా సింపుల్ గా కనిపించబోతున్నట్టుగా గేమ్ ఛేంజర్ ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది.
ఇక ఈ చిత్రానికి కియారా అద్వానీ అందుకున్న పారితోషికం పై అందరిలో చాలా క్యూరియాసిటీ ఉంది. బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ గా మారిన కియారా అద్వానీ గేమ్ చెంజర్ కోసం 7 నుంచి ఎనిమిది కోట్ల పారితోషికం అందుకుంది అని తెలుస్తోంది. దానిపై గేమ్ ఛేంజర్ విలన్ ఎస్ జె సూర్య చేసిన కామెంట్స్ ఇప్పడు వైరల్ గా మారాయి.
ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జరగండి సాంగ్ లో విజువల్స్ చూసాను, కళ్ళు సరిపోలేదు, థియేటర్స్ లో ఈ సాంగ్ ఒక్కదానికే ఆడియెన్ పెట్టిన డబ్బులు వర్త్ అనిపిస్తాయి, కియారా అయితే ఈ సాంగ్ లో ఎంత గ్లామర్ ట్రీట్ ఇస్తుంది అంటే దిల్ రాజు ఈ సినిమా కోసం కియారా అద్వానీకి ఇచ్చిన రెమ్యునరేషన్ ఆ ఒక్క సాంగ్ కే ఖర్చయిపోయి ఉంటుంది అంటూ సరదాగా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.