Advertisement
Google Ads BL

ఐమ్యాక్స్‌లో రామ్‌చ‌ర‌ణ్ గేమ్ చేంజర్


గ్లోబల్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, మాస్ట‌ర్ మూవీ మేక‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం గేమ్ చేంజర్. గేమ్ చేంజ‌ర్ చిత్రాన్ని సిల్వ‌ర్ స్క్రీన్‌పై వీక్షించ‌టానికి అభిమానులు స‌హా అంద‌రూ ఎంతో ఉత్కంఠ‌త‌తో ఎదురుచూస్తున్నారు. వావ్ అనిపించే విజువ‌ల్స్‌, అద్భుత‌మైన యాక్ష‌న్ స‌న్నివేశాలతో ప‌క్కాగా రూపొందిన ఈ చిత్రం మ‌న‌దేశంతో పాటు అంత‌ర్జాతీయంగా ఐమ్యాక్స్ థియేట‌ర్స్‌లో క‌రెక్ట్‌గా సూట్ అవుతాయి. ప్రేక్ష‌కుల‌ను ఓ స‌రికొత్త ప్ర‌పంచంలోకి ఈ సినిమా తీసుకెళుతుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. దీంతో ఎంటైర్ టీమ్ సినిమాను ఐమ్యాక్స్‌లో రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ సంద‌ర్భంగా...

Advertisement
CJ Advs

మాస్ట‌ర్ మూవీ మేక‌ర్ శంక‌ర్ మాట్లాడుతూ చ‌క్క‌టి క‌థ‌, సాంకేతిక‌త‌తో హ‌ద్దుల‌ను దాటేలా సినిమాను రూపొందిస్తే మ‌నం ఏం చేయ‌గ‌ల‌మ‌నే విష‌యం గేమ్ చేంజ‌ర్ సినిమాతో తెలుస్తుంది. ఐమ్యాక్స్‌లో గేమ్ చేంజ‌ర్ సినిమా ప్ర‌ద‌ర్శితం కానుంద‌ని తెలిసి నాకెంతో ఆనంద‌మేసింది. సినిమాను విజువ‌ల్ వండ‌ర్‌గా, భారీద‌నంతో రూపొందించాం. దాన్ని ప్రేక్ష‌కులు థియేట‌ర్స్‌లో చూసి త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తారు అన్నారు. 

గ్లోబల్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ‘గేమ్ చేంజ‌ర్‌ మూవీ నా హృద‌యానికెంతో ద‌గ్గ‌రైన చిత్రం. శంక‌ర్‌గారితో క‌లిసి ఈ సినిమా కోసం ప‌ని చేయ‌టం మ‌ర‌చిపోలేని అనుభూతినిచ్చింది. ఈ సినిమాను ఇప్పుడు ప్రేక్ష‌కులు ఐమ్యాక్స్‌లో చూసి ఎంజాయ్ చేస్తార‌ని తెలియ‌టంతో నాకు చాలా ఎగ్జ‌యిటింగ్‌గా అనిపిస్తోంది అన్నారు. మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.త‌మ‌న్ సంగీత సార‌థ్యం వ‌హించిన ఈ భారీ యాక్ష‌న్ డ్రామా పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ ప్రేక్ష‌కుల‌కు ఓ మ‌ర‌చిపోలేని అనుభూతినిస్తుంద‌న‌టంలో సందేహం లేదు.

Game Changer to Dazzle Audiences with an IMAX Release:

Global Star Ram Charan Game Changer to Dazzle Audiences with an IMAX Release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs