మీనాక్షి చౌదరికి లక్కీ భాస్కర్ సక్సెస్ బాగా పని చేస్తుంది. లక్కీ భాస్కర్ తర్వాత వరస సినిమాలు ప్లాప్ పలకరించినా ప్రస్తుతం అంటే 2024 ఏడాది ఆమెకి బాగా కొలిసొచ్చింది అనే చెప్పాలి. ఇక 2025లోను మీనాక్షి నటించిన సంక్రాంతి వస్తున్నాం చిత్రం సంక్రాంతికి విడుదలవుతుంది. మట్కా, మెకానిక్ రాకీ రిజల్ట్ తో సంబంధం లేకుండా మీనాక్షి చౌదరికి వరస ఆఫర్స్ వస్తున్నాయి
ఇప్పటికే శ్రీలీల తప్పుకున్న నవీన్ పోలిశెట్టి అనగనగ ఒకరాజు చిత్రంలోకి మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా సింపుల్ గా కనబడుతున్న మీనాక్షి చౌదరి.. నవీన్ పొలిశెట్టి దర్శకత్వంలో అనగనగా ఒకరాజు సినిమాలో మాత్రం యువరాణిలా చాలా అందంగా కనిపంచబోతుంది.
ఇవే కాకుండా మీనాక్షి ఒకటి రెండు కోలీవుడ్ ప్రాజెక్ట్స్ కి సైన్ చేయబోతుంది అనే న్యూస్ కోలీవుడ్ సర్కిల్స్ లో నడుస్తుంది. వరుసగా ఫ్లాప్స్ ఎదురైనా మంచి సినిమాల్లో, క్రేజీ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు మాత్రం భలేగా పట్టేస్తుంది ఈ భామ.