Advertisement
Google Ads BL

MAA అధ్యక్షుని అధికారిక ప్రకటన


ప్రియమైన సభ్యులందరికీ,

Advertisement
CJ Advs

మన కళాకారులు  ఎల్లప్పుడూ అన్ని ప్రభుత్వాల  ప్రజాప్రతినిధులతో అనుబంధం, సాన్నిహిత్య సంబంధాలు కలిగి ఉంటారు. మన  చిత్ర పరిశ్రమ సహకారం మరియు సృజనాత్మకత  పై ఆధారపడి నడిచే పరిశ్రమ. గతంలో వివిధ ప్రభుత్వాల మద్దతు వల్ల మన చిత్ర పరిశ్రమ ఎంతో ఎదిగింది. ప్రత్యేకంగా, తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాదులో స్థిరపడటానికి, అప్పటి ముఖ్యమంత్రి చెన్నా రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం అత్యంత ముఖ్యమైనది. ఈ విధంగా, ప్రతి ప్రభుత్వంతో మన పరిశ్రమకు ఎల్లప్పుడూ సత్సంబంధాలు కొనసాగుతూ వస్తున్నాయి.

ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని, సభ్యులందరూ సున్నితమైన విషయాలపై వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగంగా ప్రకటించడం గానీ, వివాదాస్పద అంశాలలో పక్షాలు తీసుకోవడాన్ని గానీ నివారించండి.కొన్ని సమస్యలు వ్యక్తిగతమైనవి, మరికొన్ని విషాదకరమైనవి, వాటిపై చట్టం తన దారిలో తను న్యాయం చేస్తుంది. అలాంటి అంశాలపై మాట్లాడటం వల్ల అది  సమస్యలను పరిష్కరించడానికి బదులుగా, సంబంధిత పక్షాలకు మరింత నష్టం చేస్తుంది. ఈ సమయంలో మనకి restraint (సహనం), సానుభూతి, మరియు సంఘ ఐక్యత అవసరం.

రాబోయే  పండుగల సందర్భంగా, మీకు క్రిస్మస్  మరియు నూతన  సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఓ పెద్ద కుటుంబం అని సంగతి గుర్తించుకుందాం. ఏ సమస్యలు వచ్చినా, మనమంతా  కలిసి  అవన్నీ ఎదుర్కొంటామని తెలియజేస్తున్నాను.

విష్ణు మంచు

అధ్యక్షుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA)

ఈ నోట్ అసోసియేషన్ సభ్యులకు పంపారు.. అని తెలుస్తోంది. 

Official Statement from the President - MAA:

Official Statement from the President, Movie Artiste Association 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs