Advertisement
Google Ads BL

ఆరు రోజుల్లోనే 1000 కోట్లు పుష్ప-2


బ్రిలియంట్‌ అండ్‌ జీనియస్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ అత్యద్భుతమైన టేకింగ్‌..మెస్మరైజింగ్‌ కథ కథనాలు వెరసి.. పుష్ప-2 ది రూల్‌ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామి, సరికొత్త రికార్డుల మోత.. ఇండియన్‌ సినీ చరిత్రలో పుష్ప-2 సరికొత్త అధ్యాయం..

Advertisement
CJ Advs

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ల పుష్ప-2 ది రూల్‌.. చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌పై సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తోంది. ఈ సన్సేషన్‌ కాంబినేషన్‌లో అత్యున్నత నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్‌ సుకుమార్‌ రైటింగ్‌ సంస్థతో కలిసి ఈ ఇండియన్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమాను నిర్మించింది. విడుదలకు ముందే ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం  సినిమా విడుదల రోజు ప్రీమియర్‌స్‌ నుంచే సన్సేషనల్‌ బ్లాకబస్టర్‌ అందుకుంది. 

అల్లు అర్జున్‌ నట విశ్వరూపంకు, సుకుమార్‌ వరల్డ్‌ క్లాస్‌ టేకింగ్‌.. ప్రపంచ సినీ ప్రేమికులు ఫీదా అయిపోయారు. ముఖ్యంగా ఇండియాలో ఈ చిత్రం సృష్టించిన రికార్డుల పరంపరకు ఆకాశమే హద్దుగా ఉంది. సినిమా తొలి రోజు నుంచే మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు.. నాలుగవ రోజు.. ఐదవ రోజు.. ఆరవ రోజు  వసూళ్లలో వరుసగా ఇండియా ఆల్‌టైమ్‌ రికార్డులు సృష్టించిన ఈ చిత్రం తాజాగా ఆరు రోజుల్లో రూ.1002 కోట్లు వసూలు ఇండియన్‌ సినిమా చరిత్రలోనే అత్యంత వేగవంతగా రూ. 1000 కోట్లు కలెక్ట్‌ చేసిన  తొలి చిత్రంగా సరికొత్త రికార్డును నెలకొల్పింది.

కేవలం ఆరు  రోజుల్లోనే  రూ.1002 కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ చిత్రంగా పుష్ప-2 ది రూల్‌ బాక్సాఫీస్‌పై సరికొత్త అధ్యాయాన్ని క్రియేట్‌ చేసింది. ప్రతి భాషలో సునామీలా దూసుకపోతున్న పుష్ప-2 ముఖ్యంగా బాలీవుడ్‌లో తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. బాలీవుడ్‌లో హిందీలో ఆరు రోజులకు రూ. 375  కోట్లు కలెక్ట్‌ చేసి, ఇప్పటివరకు ఇంత త్వరగా అంటే కేవలం ఆరు రోజుల్లోనే రూ.375 కోట్లు   కలెక్ట్‌ చేసిన తొలి  హిందీ చిత్రంగా నిలిచింది.  

దీంతో పాటు పలు రికార్డులు కూడా పుష్పరాజ్‌ కైవసం చేసుకున్నారు. ఒక రికార్డు ప్రకటించే లోపే మరొ కొత్త రికార్డును పుష్ప-2 సాధిస్తుండటం యావత్‌ భారతీయ సినీ పరిశ్రమను సంభ్రమశ్చర్యాలకు గురిచేస్తుంది. రష్మిక మందన్నా నాయికగా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ అద్భుతమైన బాణీలను అందించాడు. కూబా ఫోటోగ్రఫీ సినిమాకు వన్నెతెచ్చింది.  ఈ చిత్రం సాధించిన, సాధిస్తున్న వసూళ్లతో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఇండియా నెంబర్‌వన్‌ హీరోగా అందరూ కొనియాడుతున్నారు. దర్శకుడు సుకుమార్‌ కూడా భారతదేశం గర్వించదగ్గ దర్శకుడిగా టాప్‌ పొజిషన్‌లో ఉన్నాడు.

Fastest 1000cr gross in just 6 days Pushpa 2 - The Rule:

Pushpa 2 - The Rule
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs