Advertisement
Google Ads BL

పవన్-ప్రభాస్ సినిమాలతో మరింత దగ్గరవుతా- నిధి


రెబెల్ స్టార్ ప్రభాస్ తో రాజా సాబ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన హరి హర వీరమల్లు వంటి ప్రెస్టీజియస్ మూవీస్ లో నటిస్తోంది బ్యూటిఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్. ఈ నేపథ్యంలో ఆమె ఆస్క్ నిధి పేరుతో ఛాట్ చేసింది. పర్సనల్, కెరీర్ విషయాలపై నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. మూవీ లవర్స్, అభిమానులు నిధి అగర్వాల్ కు ప్రశ్నలు పంపించేందుకు ఆసక్తి చూపించారు.

Advertisement
CJ Advs

ప్రభాస్ తో కలిసి నటిస్తున్న రాజా సాబ్ సినిమా సెట్ లో ఎంతో సరదాగా పనిచేశామని, ఈ మూవీ టీమ్ లో ఎంతో డెడికేషన్ ఉందని నిధి అగర్వాల్ తెలిపింది. పవన్ కల్యాణ్ తో రీసెంట్ గాా ఓ సెల్ఫీ తీసుకున్నానని, త్వరలోనే ఆ సెల్ఫీ పోస్ట్ చేస్తానని నిధి ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. తనకు తెలుగు బాగా మాట్లాడటం వచ్చు అని, కేవలం అందరికీ నమస్కారం అనే బ్యాచ్  కాదని ఫన్నీగా ఆన్సర్ చెప్పింది. 

పీఆర్ మెయింటేన్ చేయడం తనకు కష్టమైన పనిగా అనిపిస్తుందని పేర్కొంది. నెక్ట్ ఇయర్ తన రెండు మూవీస్ రాజా సాబ్, హరి హర వీరమల్లు రిలీజ్ అవుతాయని, ఆ రెండు చిత్రాలతో నాయికగా ప్రేక్షకులకు మరింత చేరువవుతానని ఆశాభావం వ్యక్తం చేసింది నిధి అగర్వాల్. ఈ రెండు చిత్రాలతో పాటు మరో సర్ ప్రైజింగ్ మూవీ కూడా ఉందని తెలిపింది.

Raja Saab and HHMV will bring me closer to the audience - Nidhhi Agerwal:

The Raja Saab and Hari Hara Veera Mallu will bring me closer to the audience - Nidhhi Agerwal
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs