Advertisement
Google Ads BL

నా జర్నీలో సుకుమార్‌ ప్రత్యేకం-అల్లు అర్జున్


అల్లు అర్జున్ ముంబై ఈవెంట్ లో మాట్లాడుతూ.. 

Advertisement
CJ Advs

సినిమా విషయంలో నేను థాంక్స్‌  చెప్పుకోవాల్సింది నిర్మాతలకు.. వాళ్లు లేకుంటే, వాళ్ల సపోర్ట్‌ లేకుండా ఈ సినిమా సాధ్యపడేది కాదు. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో విడుదల చేస్తున్న అనిల్‌ తడానిజీ, భరత్‌ భూషణ్‌లకు థ్యాంక్స్‌.. పుష్ప చిత్రాన్ని కోవిడ్‌ టైమ్‌లో చాలా ఛాలెంజ్‌లు ఫేస్‌ చేసి చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా  నా టెక్నిషియన్ల అందరికి  కృతజ్ఞతలు.  నా చిన్ననాటి స్నేహితుడు నా కెరీర్‌లో ఎన్నో సూపర్‌హిట్‌ సాంగ్స్‌ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్‌కు ప్రత్యేక కృతజ్క్షతలు. 

త్వరలోనే పుష్ప-2 నుంచి మరో సూపర్‌ సాంగ్‌ రాబోతుంది. ఈ  పాటతో  దేవి మ్యాజిక్‌ మరో సారి తెలుస్తుంది. అందరి హృదయాలను హత్తుకునే పాట అది. ఫహాద్‌ ఫాజిల్‌తో పనిచేయడం ఎంతో గ్రేట్‌గా వుంది. శ్రీలీల, రష్మికలతో పనిచేయడం ఎంతో హ్యపీ. గత నాలుగు సంవత్సరాలుగా రష్మికతో కలిసి పనిచేశాను.  ఆమెతో వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స ఎంతో ఎనర్జీ వస్తుంది.  చాలా పాజిటివ్‌ ఎనర్జీ ఉన్న హీరోయిన్‌. ఈ ప్రపంచంలో ఇలాంటి అమ్మాయిలు కావాలి అనిపించేంతగా రష్మిక గొప్పతనం కనిపిస్తుంది.  

నా జర్నీలో దర్శకుడు సుకుమార్‌తో  20 ఏళ్ల  ప్రయాణం మొదలైంది. పుష్ప ఈ రోజు నేను హీరోగా ఇలా వున్నానంటే ఆయనే  కారణం నన్ను స్టార్‌ను చేసింది సుకమారే. నా  లైఫ్‌లో అత్యధిక భాగం.. హీరోగా నా ఎదుగుదల ఆయనకే చెందుతుంది. ఈ రోజు ఆయన రాలేదు కానీ ఈ రోజు కూడా చిన్న చిన్న మార్పుల కోసం సినిమాపై ఇంకా పనిచేస్తున్నాడు. ఈ సినిమా ఇంత డబ్బు వస్తుంది.. ఇంత పేరు వస్తుందని లెక్కలు వేసుకోని చేయలేదు. ప్రేక్షకులకు ఓ బెస్ట్‌ సినిమా ఇవ్వాలి. వాళ్లకు గొప్ప ఎక్స్‌పీరియన్స్‌ సినిమా ఇవ్వాలని వర్క్‌ చేశాం.  ఐదు సంవత్సరాలు మా లైఫ్‌లో బెస్ట్‌ ప్రొడక్ట్‌ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. బెస్ట్‌ సినిమా ఇస్తున్నాం. 

మేము పుష్ప పార్ట్‌-1 సాధారణ సినిమాగానే చేశాం. కానీ ప్రేక్షకలు తమ ఆదరణతో గొప్ప సినిమా చేశారు. ఈ రోజు పుష్ప-2 రూపంలో బిగ్గెస్ట్‌ ఇండియన్‌ సినిమా చేయడానికి కారణం మీ ఆదరణే. ఈ రోజు ప్రపంచంలోని ప్రతి దగ్గరి నుంచి, ప్రపంచంలో ప్రతి ఇండియన్‌, ప్రతి భాష వాళ్లు, ప్రతి రాష్రంలోని వాళ్లు అందరూ కలిసి పుష్ప-2 విడుదలను సెలబ్రేట్‌ చేయడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు.  

Allu Arjun about Sukumar:

Pushpa 2 Mumbai event highlights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs