Advertisement
Google Ads BL

RGV అరెస్ట్ అనుకునేవారికి బ్యాడ్ న్యూస్


రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ వార్తలపై చేసిన ట్వీట్ 

Advertisement
CJ Advs

నా కేసు —- RGV 

1.

 నేను ఏదో పరారీలో ఉన్నాను , ఇంకా మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాలలో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నరని ఆనందపదుతున్న వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్ .. ఎందుకంటే ఈ టైమ్ అంత నేను నా డెన్ ఆఫీసు లోనే ఉన్నాను, అప్పుడప్పుడు నా సినిమా పనుల కోసం బయటకి వెళ్ళడం తప్ప. 

2.

ఇంకో షాక్ ఏంటంటే పోలీసులు ఇంత వరకు నా ఆఫీసు లోకి కాలే పెట్టలేదు.. పైగా నన్ను అరెస్టు చేయడానికి వచ్చినట్లు నా మనుషులతో కానీ మీడియా తో కానీ చెప్పలేదు.  ఒక వేళ నన్ను అరెస్టు చేయడానికే వస్తే నా ఆఫీసు లోకి ఎందుకు రారు?

3.

నా మీద కేసు ఏంటంటే నేను ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం నా సోషల్ మీడియా అకౌంట్ లో పెట్టాను అని అంటున్న కొన్ని మీమ్స్, ఇప్పుడు సడెన్ గా అసలు సంబంధం లేని వ్యక్తులా మనోభావాలు దెబ్బతినటం మూలన ఆ కంప్లయింట్ ఇచ్చారంట.

4.

ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే 4 వేర్వేరు వ్యక్తులు , ఆంధ్ర ప్రదేశ్ లోని 4 వేర్వేరు జిల్లాల్లో నా మీద ఈ కేసు పెట్టారు. ఇంకా మీడియా ప్రకారం  మరో 5 కేసులు కూడా నమోదు అయ్యాయి, అవన్నీ కలిపి మొత్తం 9 కేసులు, ఇవన్నీ కూడా కేవలం గత 4 , 5 రోజుల్లోనే నమోదు అయ్యాయి. 

5.

నాకు నోటీసు అందిన వెంటనే ,  నా సినిమా పనుల వల్ల, సంబంధిత అధికారిని కొంత సమయం కోరడం జరిగింది. ఆయన కూడా అనుమతించడం జరిగింది . కానీ నా పనులు పూర్తి కాకపోవడం వల్ల మరికొంత టైం అడగడం , లేకపోతే  విడియో ద్వారా హాజరు అవుతాను అని తెలియజేయడం జరిగింది. .. అదే టైమ్ లొ నా మీద అన్ని వేర్వేరు ప్రాంతాల్లో కేసులు నమోదు అవ్వడం వెనక ఏదో కుట్ర ఉంది అని కూడా  నాకు ,నా వాళ్ళకి అనుమానం కలిగింది. 

6.

నేను సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటాను, చాలా సార్లు రోజుకి 10 నుంచి 15 పోస్టులు కూడా చేసేవాడిని,  ఒక సంవత్సర కాలంలో కొన్ని వేళ పోస్టులు చేసి ఉంటాను. వాళ్ళు  నేను పెట్టాను అంటున్న  పోస్టులు నేను చేసిన ఒక రాజకీయ వ్యంగ్య చిత్రం కు సంబంధించినవి, ఆ చిత్రాన్ని సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడం ఆ చిత్రం విడుదల అవ్వడం కూడ చాలా  నెలల క్రితం జరిగిపోయింది

7.

నేను పెట్టాను అంటున్న పోస్టులు , వేటి వల్ల ఐతే కొందరు వ్యక్తులు వేర్వేరు ప్రాంతాల లో తమ మనోభావాలు దెబ్బ తిన్నాయి అంటున్నారో అవి ఈ నోట్ క్రింద పెట్టడం జరిగింది.

8.

ఈ మీమ్స్ కారణంగా నా మీద 336 (4), 353 (2), 356 (2), 61 (2), 196, 352 of BNS and section 67 of IT సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేయబడ్డాయి. 

9.

BNS 336(4)

ఏవైనా పత్రాలను కానీ ఎలక్ట్రానిక్ రికార్డు ను కానీ ఇతరులను మోసం చేయడానికి లేదా వారి పరువుకు భంగం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా నకిలీవి సృష్టించడం 

నేను చేసిన పోస్టుల చూస్తే , అందులో ఫోర్జరీ ఎక్కడుంది? , అది కేవలం ఒక కార్టూన్, ఒకవేళ దీని వల్ల ఒకరి పరువుకు భంగం కలిగింది అంటే మరి కొన్ని లక్షల మంది ఇంకొన్ని లక్షల మంది మీద రోజు పెడుతున్న వాటి సంగతి ఏంటి. ?  

10.

BNS 353(2)

తప్పుడు సమాచారం, వదంతులు లేదా భయపెట్టే వార్తలను కలిగి ఉన్న ఏదైనా ప్రకటన లేదా నివేదికను రూపొందించే లేదా ప్రోత్సహించే ఉద్దేశ్యంతో లేదా సృష్టించడానికి లేదా ప్రోత్సహించే అవకాశం ఉన్న ఎలక్ట్రానిక్ మార్గాలతో సహా, మతం, జాతి ప్రాతిపదికన ప్రచురించే లేదా ప్రసారం చేసే వ్యక్తి పుట్టిన ప్రదేశం, నివాసం, భాష, కులం లేదా సంఘం లేదా ఏదైనా ఇతర మైదానం, వివిధ మత, జాతి, భాష లేదా ప్రాంతీయ సమూహాలు లేదా కులాలు లేదా వర్గాల మధ్య శత్రుత్వం, ద్వేషం లేదా చెడు భావాలను కించపరచడం 

నా కేసు విషయం లో ఇది ఎలా వర్తిస్తుందో నాకు అర్థం కావడం లేదు.

RGV tweet on arrest news:

Ram Gopal Varma
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs