Advertisement
Google Ads BL

గేమ్ ఛేంజర్ నుంచి కలర్ ఫుల్ అప్ డేట్


గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం గేమ్ చేంజర్. ఓ వైపు అభిమానులు, మ‌రోవైపు సినీ ప్రేక్ష‌కులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తోన్న సంగ‌తి తెలిసిందే. 

Advertisement
CJ Advs

ఇప్పటికే గేమ్ చేంజర్ చిత్రం నుంచి వచ్చిన పాటలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. జరగండి, రా మచ్చా పాటలు యూట్యూబ్‌లో చార్ట్ బస్టర్‌లుగా నిలిచాయి. ఇక మరోసారి శ్రోతల్ని, అభిమానుల్ని కట్టి పడేసేందుకు మూడో పాటను రిలీజ్ చేయబోతోన్నారు. న్యూజిలాండ్‌లో రామ్ చరణ్, కియారా అద్వానీలపై షూట్ చేసిన ఈ మెలోడీ గీతాన్ని నవంబర్ 28న రిలీజ్ చేయబోతోన్నట్లుగా కలర్ ఫుల్ పోస్టర్ తో అప్ డేట్ ఇచ్చారు. ఈ పోస్టర్లో రామ్ చరణ్, కియారా ఎంతో కూల్‌గా కనిపిస్తున్నారు.

డిసెంబ‌ర్ 21న అమెరికాలో చరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత భారీగా నిర్వహించబోతోన్నట్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. గేమ్ చేంజర్ టీజర్‌తో అంచనాలు పెంచిన చిత్రయూనిట్ మున్ముందు మరిన్ని ప్రమోషనల్ కంటెంట్‌తో ఆడియెన్స్ ముందుకు రానుంది.

Game Changer Third Single update :

Game Changer Third Single to Release on November 28
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs