Advertisement
Google Ads BL

అఫీషియల్ - విరూపాక్ష దర్శకుడితో చైతు


సుకుమార్‌ రైటింగ్స్‌ అసోసియేషన్‌తో నిర్మాణం చేస్తున్న ఎస్వీసీసీ సంస్థ సంయుక్తంగా గత ఏడాది సాయి దుర్గా తేజ్‌, సంయుక్త  మీనన్‌లతో కార్తీక్‌ దండు దర్శకత్వంలో బ్లాక్‌బస్టర్‌ మిస్టికల్‌ థ్రిల్లర్‌ విరూపాక్ష చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర సంచలనం సృష్టించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇప్పుడు విరూపాక్ష చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను చాటి చెప్పిన కార్తీక్‌ దండు దర్శకత్వంలోనే చైతు-కార్తీక్ దండు తాజా చిత్రాన్ని భారీ చిత్రాల మేకర్‌ ప్రముఖ  బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. 

Advertisement
CJ Advs

ఈ చిత్రానికి బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ కూడా వన్‌ ఆఫ్‌ ద  ప్రొడ్యూసర్‌గా ఉండటం ఈ సినిమాకు మరో ఆకర్షణ. కాగా ఈ చిత్రంలో వైవిధ్యమైన చిత్రాలతో ప్రామిసింగ్‌ కథానాయకుడిగా పేరున్న యువ సామ్రాట్‌  అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్నారు. శనివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా, ఆసక్తికరమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

ఈ పోస్టర్‌లో ఒక అద్భుతమైన కన్ను ప్రతీకతో పాటు, రాక్ క్లైంబింగ్ టూల్స్‌తో ఓ పర్వతంపై నిలబడి ఉన్న నాగ చైతన్య కనిపించారు. ఇది ప్రేక్షకులలో భారీ ఆసక్తిని రేకెత్తించింది. NC24 అనే వర్కింగ్‌ టైటిల్‌తో, ఈ చిత్రం డిసెంబరులో షూటింగ్ ప్రారంభించుకోనుంది. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత ప్రొడక్షన్ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

కార్తీక్ దండు ఈ ప్రాజెక్ట్ కోసం అత్యుత్తమ సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకున్నారు.  ప్రత్యేకంగా, ఈ చిత్రానికి అధిక స్థాయిలో CG వర్క్ ఉండనుంది, ఇది ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్‌  అనుభూతిని అందించేందుకు సహాయపడుతుంది. శ్యామ్‌ దత్‌  ISC సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్‌కు బాధ్యతలు స్వీకరించగా, విరూపాక్ష చిత్రానికి అద్భుతమైన సెట్స్ రూపొందించిన ఆర్ట్ డైరెక్టర్ శ్రీ నాగేంద్ర కూడా ఈ చిత్రంలో భాగమవుతున్నారు. కాంతారా మరియు విరూపాక్ష సినిమాలతో ఆకట్టుకున్న అజనీష్ లోక్‌నాథ్ ఈ థ్రిల్లర్‌కు సంగీతం అందించనున్నారు.

Naga Chaitanya upcoming mythical thriller announcement :

Naga Chaitanya upcoming mythical thriller NC24 directed by Karthik Dandu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs