Advertisement
Google Ads BL

కాంతార చాప్టర్‌ 1 రిలీజ్ డేట్


కన్నడ స్టార్ రిషభ్‌ శెట్టి లీడ్ రోల్ లో నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాంతార చాప్టర్‌ 1. ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కాంతార సినిమాకు ప్రీక్వెల్‌గా ఈ సినిమా సిద్ధమవుతోంది. రిషభ్‌ స్వీయ దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.  

Advertisement
CJ Advs

తాజాగా మేకర్స్ రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్ చేశారు. 2025 అక్టోబర్‌ 2న కాంతార చాప్టర్‌ 1వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇండియాలో దసరా బిగ్గెస్ట్ సీజన్. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న కాంతార చాప్టర్‌ 1 రిలీజ్ కు ఇది పర్ఫెక్ట్ టైమ్.  

రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో రిషభ్‌ శెట్టి ఫెరోషియస్ అవతార్ లో కనిపించారు. ఒక చేతిలో త్రిశూలం మరో చేతిలో గొడ్డలి పట్టుకొని లెజెండ్ గా కనిపించిన పోస్టర్ అదిరిపోయింది.

కాంతార చాప్టర్‌ 1 కోసం నటుడు-దర్శకుడు రిషబ్ శెట్టి తన పాత్ర కోసం ప్రత్యేకంగా సిద్ధమయ్యారు. కేరళ నుండి ఉద్భవించిన పురాతన యుద్ధ కళలలో ఒకటైన కలరిపయట్టులో రిషబ్ కఠినమైన శిక్షణ పొందారు. 

కాంతార కొంకణ్ జానపద గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. గ్రిప్పింగ్ నేరేషన్, బ్రెత్ టేకింగ్ విజువల్స్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ లతో ప్రపంచవ్యాప్తంగా అందరినీ అలరించింది. ఈ ఫ్రాంచైజీకి గ్లోబల్ ఫ్యాన్ బేస్ వుంది. 

Kantara 1 release date locked:

Kantara 1 release date announced officially <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs