స్టార్ హీరో సూర్య నటించిన ప్రెస్టీజియస్ మూవీ కంగువ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా మొదటిరోజు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. కంగువ ఫస్ట్ డే 58.62 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. రెండు డిఫరెంట్ రోల్స్ లో సూర్య నటన, హై క్వాలిటీ టెక్నికల్ వ్యాల్యూస్, లార్జర్ దేన్ లైఫ్ ఎలిమెంట్స్ ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తున్నాయి.
కంగువలో ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసి మెప్పించడంలో మూవీ టీమ్ సక్సెస్ అయ్యారు. హీరో సూర్య కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ అందుకునే దిశగా కంగువ బాక్సాఫీస్ జర్నీ బిగిన్ చేసింది.
ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందించారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించారు.