Advertisement
Google Ads BL

రాబిన్‌హుడ్ టీజర్ : వెరీ డేంజరస్


హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో యూనిక్ యాక్షన్, హీస్ట్ కామెడీ రాబిన్‌హుడ్ ఇన్నోవేటివ్ ప్రోమోలతో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. పోస్టర్లు, క్యారెక్టర్‌ ఇంట్రడక్షన్‌ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. విడుదలకు సిద్ధమవుతున్న ఈ క్రేజీ హై-బడ్జెట్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈరోజు ఎంటర్ టైనింగ్ టీజర్‌ను రిలీజ్ చేయడంతో మేకర్స్ రియల్ ప్రమోషన్‌లను ప్రారంభించారు.

Advertisement
CJ Advs

టీజర్ పవర్ ఫుల్ వాయిస్‌ఓవర్‌తో ప్రారంభమైంది, ఇది ఇంటెన్స్ నెరేటివ్ కి టోన్‌ని సెట్ చేస్తుంది. నితిన్ హై-ఫై ఇళ్లను లక్ష్యంగా చేసుకుని, అడ్వంచరస్  దోపిడీలను చేసే మోడరన్ రాబిన్‌హుడ్‌గా పరిచయం అయ్యారు. అతనికి ప్రత్యేకమైన ఎజెండా లేదా నిర్దిష్ట కారణం ఏమీ లేదు, అతని ఏకైక మోటివేషన్ డబ్బు. ఇలాంటి సిట్యువేషన్స్ లో అతను పవర్ ఫుల్ కుటుంబ నేపథ్యం శ్రీలీల ని ఇష్టపడతాడు. ఇది ఇప్పటికే డేంజర్ లో వున్న అతని లైఫ్ ని మరింత కాంప్లికేట్ చేస్తుంది.

వెంకీ కుడుముల ప్రతి ప్రమోషన్ మెటీరియల్‌లో నెరేటివ్ లో తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఈసారి, టీజర్ నితిన్ పాత్రపై మరింత ఇన్ సైట్ ని అందిస్తూ, మూవీ ప్రిమైజ్ ని గ్లింప్స్ గా అందిస్తుంది. వినోదం, యాక్షన్, బ్రెత్ టేకింగ్  మూమెంట్స్ బ్లెండ్ తో దర్శకుడు ప్రేక్షకులను కట్టిపడేశాడు.

నితిన్ రాబిన్‌హుడ్‌గా అదరగొట్టారు, డిఫరెంట్ లుక్‌లలో డైనమిక్ పెర్ఫార్మెన్స్ అందించాడు. ఒక సీన్ నిజమైన దేశభక్తుడు ఏజెంట్ రాబిన్‌హుడ్, మరో సీన్ లో అరబ్ షేక్‌గా కనిపించి తీరు విశేషంగా అలరించింది. సినిమా రెండు విభిన్న కోణాలను, నితిన్ వెర్సటాలిటీని హైలైట్ చేస్తుంది.

Robinhood movie teaser out :

Robinhood teaser review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs