Advertisement
Google Ads BL

జితేందర్‌ రెడ్డి రివ్యూ


జితేందర్‌ రెడ్డి రివ్యూ 

Advertisement
CJ Advs

నటీనటులు: రాకేష్ వర్రే, రియా సుమన్, వైశాలి, సుబ్బరాజు, రవిప్రకాష్ 

డైరెక్టర్: విరంచి వర్మ 

సినిమాటోగ్రఫీ: జ్ఞాన శేఖర్ V S

ఎడిటర్: రామకృష్ణ అర్రం 

మ్యూజిక్: గోపి సుందర్ 

ప్రొడ్యూసర్: M రవీందర్ రెడ్డి 

ప్రోడుక్షన్: ముదుగంటి క్రియేషన్స్  

కథ:

తాజాగా వచ్చిన తెలుగు చలన చిత్రం జితేంతర్‌రెడ్డి వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించబడ్డ ఓ అన్‌టోల్డ్ స్టోరీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కరీంనగర్ జిల్లా జగిత్యాల వేదికగా జరిగిన ఓ యధార్థ కథ ఇది. 1980 నుంచి 1990 మధ్య చోటు చేసుకున్న పరిణామాలను కళ్లకు కట్టిన విధంగా చిత్రీకరించారు మేకర్స్. ఓవైపు RSS, ABVP, BJP కార్యకర్తలు…మరోవైపు నక్సలైట్లు, వారికి వెన్నుదన్నుగా ఉండే కమ్యూనిస్టుల మధ్య రేగిన కార్చిచ్చే ఈ జితేందర్‌రెడ్డి చిత్రం. వాస్తవానికి ఈ చిత్రం ఏ యొక్క వర్గానికో, ఏపార్టీని ఉద్దేశించో, ఏ వ్యక్తిని ఉద్దేశించో తీసిన చిత్రం కాదంటూనే చెప్పాల్సిన విషయాన్ని ముక్కుసూటిగా చెప్పేశారు.

బడుగు బతుకుల బాగు కోసం, దొరల కొమ్ములను తమ తుపాకీలతో నేలకొరిగేలా చేసిన ‘అన్నల తూపాకీ తూటా’…రానూరానూ గురితప్పి గతితప్పిందా?, వారి ఉనికి కోసం సమాజంలోని కొందరి సానుభూతిపరులను తమ స్వార్థానికి వాడుకుని జీవితాలను అడవిపాలు చేసిందా?, నక్సలిజం ముసుగులో అడవిలోని అన్నలు గ్రామాల్లో అభివృద్ధిని అడ్డుకోవడం దేనికి?, జాతీయవాదులు రవన్న, గోపన్నల గుండెల్లో దూరిన అన్నల తూటాలు జితేందర్‌రెడ్డిలో ఎలాంటి మార్పు తీసుకొచ్చాయి?, ప్రజల పక్షాన ఉండాల్సిన నక్సలైట్లు….ప్రజాక్షేమం కోరే జితేంతర్‌రెడ్డి, అతని అనుచరులను ఎందుకు చంపాలని అనుకుంటారు?, జితేందర్‌రెడ్డికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన గన్‌మ్యాన్‌… నక్సల్స్ మూకుమ్మడి దాడి నుంచి తప్పించుకుని ఏం చేస్తాడు?, జాతీయవాదిగా నక్సలిజంపై ఉక్కుపిడికిలి బిగించిన జితేంతర్‌రెడ్డి… రాజకీయ ప్రవేశం చేసేలా దారితీసిన కారణాలు ఏంటి?, జగిత్యాల టైగర్‌ ఎవరంటే కొన్నిదశాబ్దాలుగా మార్మోగుతున్న జితేందర్‌రెడ్డి పేరు…ప్రజలమనస్సుల్లో వేళ్లూనుకుపోయేలా చేసిన సంఘటనలేంటి?, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరకాలంటే జితేందర్‌రెడ్డి చిత్రం తప్పక చూడాల్సిందే.

చిత్ర బలాబలాలు :

జగిత్యాల వేదికగా నాడు జరిగిన రాజకీయ పోరును, అప్పట్లో అన్నల తుపాకీ మోతలను, నక్సల్స్‌ గుండెల్లో గునపంగా మారిన జితేందర్‌రెడ్డి క్యారెక్టర్‌ను చక్కగా డిజైన్ చేసి టైటిల్‌కు డైరెక్టర్ విరించి వర్మ న్యాయం చేశాడనే చెప్పాలి.

జితేందర్‌రెడ్డి క్యారెక్టర్‌లో రాకేశ్ వర్రే ఒదిగిపోయాడు. అతని ఆహార్యం సినిమాకు ప్లస్ పాయింట్.

జాతీయవాదిగా, దేశభక్తుడి క్యారెక్టర్‌లో సుబ్బరాజు తన పాత్రకు న్యాయం చేశాడు.

ఛత్రపతి శేఖర్‌ కూడా నక్సలైట్‌గా మార్కులు కొట్టేశాడు.

చిత్రంలో హీరోకి గన్‌మ్యాన్‌గా రవిప్రకాశ్ చేసిన క్యారెక్టర్‌ మొత్తం చిత్రాన్ని మలుపుతిప్పేది కావడంతో అతనికి కూడా మంచిమార్కులే పడ్డాయి.

గోపీ సుందర్ ఇచ్చిన మ్యూజిక్‌ అద్భుతమనే చెప్పాలి, ఆర్‌ఆర్‌ అదరగొట్టాడు.

1980లో జరిగిన స్టోరీ కావడంతో సినిమాటోగ్రఫీ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు, ఎక్కడా అధునాతనంగా కనిపించే సన్నివేశాలను స్క్రీన్‌పై కనపడకుండా నాటి రోజుల్లోకి ప్రేక్షకులను తీసుకెళ్లడం గమనార్హం.

చిత్రంలో టీడీపీ ముఖ్యుల సన్నివేశాలు…ఎన్టీఆర్ స్వరం, ఆయన ఆహార్యంతో కూడిన క్యారెక్టర్‌… జితేంతర్‌రెడ్డి కథలో ప్రధాన పాత్రలు కావడంతో ప్రేక్షకుడు నాటి పొలిటికల్ డ్రామాపై దృష్టిపెట్టేలా ఉండటం కూడా మరో అస్సెట్ అనే చెప్పాలి.

యాక్షన్ ఎపిసోడ్స్‌ అంతా ఒళ్లు గగుర్పొడిచేలా తెరకెక్కించారు.

చిత్ర బహీనతలు :

జితేందర్ రెడ్డి జీవితం లో లవ్‌స్టోరీనే లేదు పేరుకే హీరోయిన్లను పెట్టినా పనిలేకుండా పోయింది. అయితే, హీరోయిన్‌ రియా సుమన్‌ ఎంట్రీతోనే… జితేందర్‌రెడ్డి స్టోరీలోకి ఎంట్రీ అవడంతో ఏదో ఫర్వాలేదనిపించింది.

వాస్తవిక కథలంటూ ఈ మధ్య వచ్చిన సినిమాల్లో కాస్తోకూస్తో హాస్యాన్ని జోడిస్తున్నా…జితేందర్‌రెడ్డి సినిమాలో మచ్చుకైనా నవ్వుకోవడానికి ఏ సన్నివేశమూ కనపడకపోవడం మైనస్‌గా చెప్పొచ్చు.

సీరియస్ గా నడుస్తున్న సినిమా మధ్యలో ఉన్నపళంగా గ్రూప్ సాంగ్ వచ్చిపోవడం ప్రేక్షకుడిని అంతగా కనెక్ట్ చేయకపోవచ్చు.

ఓవైపు లెఫ్టిస్టులు…మరోవైపు బీజేపీ, ఆరెస్సెస్‌… మధ్యలో టీడీపీ పాత్రలు ఉండటంతో మున్ముందు ఈ మూవీ కాస్త వివాదాల్లో చిక్కుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు క్రిటిక్స్.

ఉయ్యాల జంపాలా అనే లవ్‌స్టోరీ దర్శకుడిగా తెరంగేట్రం చేసి, నానితో మజ్ఞులాంటి సినిమానూ తెరకెక్కించిన డైరెక్టర్‌ విరించి వర్మ…దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత తెలంగాణ పొలిటికల్ లీడర్‌ జితేందర్‌రెడ్డి కథతో రావడం విశేషం. లవ్ స్టోరీస్ తీసిన విరించి వర్మ ఈ సినిమా ఎలా హ్యాండిల్ చేస్తాడా అనుకున్నారు గానీ…. దర్శకుడిగా విరించి వర్మ కు మంచి మార్కులే పడ్డాయి. 1980లో తన అన్న ముదిగంటి జితేందర్‌రెడ్డి గుండెల్లో నక్సల్స్‌ పేల్చిన 70కిపైగా తూటాలను… ముదిగంటి క్రియేషన్స్‌పై తమ్ముడు ముదిగంటి రవీందర్‌రెడ్డి ప్రేమతో, ఇప్పటి జనరేషన్ కు తన అన్న జితేందర్ రెడ్డి జీవితం తెలియాలని ఎంతో ప్రయాస తీసిన చిత్రమే ఇది.

రేటింగ్ : 2.5/5

Jithender Reddy Review:

Jithender Reddy Telugu Movie Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs