Advertisement
Google Ads BL

ఆదిపర్వం మూవీ రివ్యూ


ఆదిపర్వం మూవీ రివ్యూ

Advertisement
CJ Advs

నటీనటులు - మంచు లక్ష్మి, ఆదిత్య ఓం, ఎస్తేర్, సుహాసిని, శ్రీజిత ఘోష్, శివ కంఠమనేని, వెంకట్ కిరణ్, సత్య ప్రకాష్, సమ్మెట గాంధీ, జెమినీ సురేష్, ఢిల్లీ రాజేశ్వరి, హ్యారీ జోష్,  జబర్దస్త్ గడ్డం నవీన్, యోగి ఖత్రి, మధు నంబియార్, బీఎన్ శర్మ, బృంద, స్నేహ అజిత్, అయోషా, జ్యోతి, దేవి శ్రీ ప్రభు, శ్రావణి, గూడా రామకృష్ణ, రాధాకృష్ణ తేలు, రవి రెడ్డి, లీలావతి, దుగ్గిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీరామ్, తదితరులు

టెక్నికల్ టీమ్

సినిమాటోగ్రఫీ - ఎస్ ఎన్ హరీశ్

మ్యూజిక్ - మాధవి సైబ, ఓపెన్ బనాన ప్రవీణ్, సంజీవ్, బి.సుల్తాన్ వలి, లుబెక్ లీ, రామ్ సుధీ(సుధీంద్ర)

ఎడిటింగ్ - పవన్ శేఖర్ పసుపులేటి

ఫైట్స్ - నటరాజ్

కొరియోగ్రఫీ - సన్ రేస్ మాస్టర్

ఆర్ట్ డైరెక్టర్ - కేవీ రమణ

ప్రొడక్షన్ మేనేజర్స్ - బిజువేముల రాజశేఖర్ రెడ్డి, కొల్లా గంగాధర్, కంభం ప్రకాష్ రెడ్డి

కో డైరెక్టర్ - సిరిమల్ల అక్షయ్ కుమార్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ - ఘంటా శ్రీనివాసరావు

సహ నిర్మాతలు - గోరెంట శ్రావణి, రవి మొదలవలస, ప్రదీప్ కాటకూటి, రవి దశిక, శ్రీరామ్ వేగరాజు.

పీఆర్ఓ- మూర్తి మల్లాల

పీఆర్ డిజిటల్ టీమ్ - కడలి రాంబాబు, దయ్యాల అశోక్

నిర్మాణం - అన్వికా ఆర్ట్స్, ఏఐ(అమెరికా ఇండియా) ఎంటర్ టైన్ మెంట్స్

రచన, దర్శకత్వం - సంజీవ్ మేగోటి

అమ్మోరు, అరుంధతి వంటి పీరియాడిక్ ఫాంటసీ సినిమాలంటే తెలుగు ప్రేక్ష‌కులు ఎంతో ఇష్ట‌ప‌డ‌తారు. అలాంటి సినిమాల‌కు గ్రాఫిక్స్ ప‌ర్‌ఫెక్టుగా కూదిరితే సూప‌ర్ హిట్ చేస్తారు. స‌రిగ్గా అలాంటి ఎంట‌ర్‌టైన్మెంట్ రిపీట్ అవుతుందా.. అనే ప్ర‌చారం నేప‌థ్యంలో మంచు లక్ష్మి ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన "ఆదిపర్వం" శుక్ర‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైంది. ఇంత‌కీ ఈ సినిమా ఎలా ఉందో ఇవాల్టీ రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.

కథ:

మంచు లక్ష్మి, ఎస్తేర్, శివ కంఠమనేని ప్రధాన పాత్రల్లో నటించిన ఆదిపర్వం చిత్రం రాయలసీమ కడప దగ్గరలోని ఎర్రగుడి నేపథ్యంతో రూపొందిన ఒక పీరియాడిక్ ప్రేమకథ.  ఈ సినిమా 1974-90 మధ్య కాలంలో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఇష్టంగా ఉండే బుజ్జమ్మ - శ్రీను 12 ఏళ్ల తర్వాత కలుసుకుంటారు. ప్రేమించుకుంటారు. సీన్ క‌ట్ చేస్తే.. ఆ ఊరిలో ఉండే అమ్మ‌వారి ఎర్ర‌గుడి గుహ‌లో ఉండే గుప్త నిధి సొంతం చేసుకుంటే రాయ‌ల‌సీమలోనే గొప్ప‌వాళ్లు అవుతార‌ని భావించి దానిపై కొంద‌రు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెడ‌తారు. ఎమ్మెల్యే నాగ‌మ్మ (మంచు లక్ష్మి) గుప్త నిధి కోసం ప్రయత్నం చేస్తుంది. ఇందుకోసం క్షుద్ర శక్తుల కోసం ప్రయత్నిస్తుంది. మ‌రోవైపు రాయప్ప అనే గ్రామ నాయ‌కుడు కూడా గుప్త నిధి కోసం ప్ర‌య‌త్నిస్తాడు. ఈ క్ర‌మంలో రాయ‌ప్ప త‌న కూతురును ఎందుకు చంపాల‌ని అనుకుంటాడు? నాగ‌మ్మను కూడా ఎందుకు చంపాల‌నుకుంటాడు? చివ‌రికి  గుప్త‌నిధి కోసం జ‌రిగిన ఆరాచ‌కాలు ఏంటీ? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

న‌టీన‌టులు:

మంచు లక్ష్మి తన నటనతో సినిమాకు ప్రాణం పోశారు. కొన్ని సీన్ల‌లో ప‌వ‌ర్‌ఫుల్‌గా క‌నిపిస్తుంది. అదిత్య ఓం కీలక పాత్రలో కనిపించగా, ఎస్తేర్ పర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్‌లో ఆకట్టుకున్నారు. అలాగే, బెంగాలి నటి శ్రీజిత ఘోష్, సుహాసినీ (చంటిగాడు ఫేం) కూడా కథలో ఇంపార్టెన్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తారు. ఈవెనింగ్  సినిమాలో హీరో, హీరోయిన్ అనే ప్రత్యేక పాత్రలు లేకుండా, ప్రతి పాత్ర కూడా కథలో భాగంగా ఉంటుంది.

విశ్లేష‌ణ‌:

ఆదిపర్వం ఒక కొత్త అనుభూతిని పంచేలా రూపొందింది. ప్రతి పాత్రను కొత్తగా స్క్రీన్ మీద చూసే విధంగా తీర్చిదిద్దాడు ద‌ర్శ‌కుడు సంజీవ్ మేగోటి. తాను రాసుకున్న క‌థ‌ను తెర‌పై స్ప‌ష్టంగా చూపించే ప్ర‌య‌త్నం చేశారు. కథా నిర్మాణం, నటీనటుల పెర్ఫార్మెన్స్, గ్రాఫిక్స్ ఈ చిత్రానికి ప్రధాన బలం. దర్శకుడు సంజీవ్ మేగోటి కథ విషయం లో చాలా జాగ్రత్త పడ్డారు కట్ ఆదిపర్వంలో గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా అమ్మోరు, అరుంధతి తరహా పీరియాడిక్ ఫాంటసీ సినిమాల మాదిరిగా ప్రేక్షకులకి దృశ్యానుభవాన్ని అందించారు. కథలొని ట్విస్ట్ లు బాగున్నాయి. కొన్ని సన్నివేశాల్లో గ్రాఫిక్స్ అద్భుతంగా కుద‌ర‌డంతో, అవి గ్రాఫిక్స్‌తో చేసినవే అని గుర్తించలేనంత సహజంగా ఉన్నాయి.

అప్పట్లో ఆల‌యాల్లో విగ్రహాలు ధ్వంసం చేసి నిధులు దొంగిలించే ఘటనలకు కొంత ఫిక్షన్‌ను మిక్స్ చేసి తెర‌కెక్కించారు. ఈ పీరియాడిక్ డ్రామా సినిమాలో అమ్మవారి ఆధ్యాత్మికతకు, స్థానిక రాయలసీమ సంస్కృతికి, యాస‌కు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ చిత్రం ఒక పీరియాడిక్ కథని ఫాంటసీతో మేళవించి రాయలసీమ నేపథ్యంలో చ‌క్క‌గా చూపించారు. ఆల‌యాల పట్ల ఉన్న గౌరవాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని గుర్తుచేస్తూ, ఈ చిత్రం ఆధ్యాత్మికతను, ధైర్యాన్ని ప్రతిబింబిస్తుంది. అన్ని త‌ర‌హా ప్రేక్ష‌కుల‌కు, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కు ఈ చిత్రం ఎంత‌గానో న‌చ్చుతుంది.

Adiparvam movie review:

Adiparvam movie telugu review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs