Advertisement
Google Ads BL

థగ్ లైఫ్ విజువల్ ఫీస్ట్ టీజర్‌ విత్ రిలీజ్ డేట్


ఉలగనాయకన్ కమల్ హాసన్ ఇండియన్ సినిమా లివింగ్ లెజెండ్. 6 దశాబ్దాల సినీ కెరీర్‌లో ఎన్నో కల్ట్ క్లాసిక్ విజయాలతో, ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు సరికొత్తగా అద్భుతమైన సినిమాలిని అందించాలనే తపనతో పని చేస్తున్నారు. చాలా మంది దర్శకులు తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా కమల్ హాసన్ తో కలిసి పనిచేయాలని కోరుకుంటారు, ఎందుకంటే సినిమాలని చేయడంలో కమల్ హాసన్ ఓ యూనివర్సిటీ.

Advertisement
CJ Advs

తన అద్భుతమైన విజన్, రైటింగ్, డైరెక్షన్ తో అశేషమైన ప్రేక్షకాదరణ పొందిన లెజెండరీ దర్శకుడు మణిరత్నం. కమల్ హాసన్, మణిరత్నం 37 సంవత్సరాల క్రితం నాయకన్/నాయకుడు లాంటి ఆల్-టైమ్ క్లాసిక్‌ని అందించారు. ఈ ఆల్-టైమ్ క్లాసిక్ ఇండియన్ ఫిల్మ్ తరతరాలుగా ప్రేక్షకులలో కల్ట్ ఫాలోయింగ్‌ వుంది. టైమ్ మ్యాగజైన్ ప్రపంచ సినిమాల్లోని 100 ఆల్-టైమ్ క్లాసిక్స్ జాబితాలో వున్న ఏకైక భారతీయ చిత్రం ఇది.

ఇలాంటి సెన్సేషనల్ కాంబినేషన్ లో వారి అప్ కమింగ్ మూవీ థగ్ లైఫ్‌ ను ప్రకటించినప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చాలా మంది అభిమానులు, సినీ ప్రేమికులు ఈ కాంబినేషన్ కోసం వేచి ఉన్నారు. చివరకు వారు 37 సంవత్సరాల తర్వాత ఒక ఎపిక్ యాక్షన్ డ్రామాను అందించడానికి రెడీ అయ్యారు. కమల్ హాసన్ విక్రమ్, మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ సినిమాల తర్వాత ఈ కాంబినేషన్ పై అంచనాలు మరింతగా పెరిగాయి.

మరింత ఎక్సయిట్మెంట్ ని యాడ్ చేస్తూ సిలంబరసన్ టిఆర్ అకా శింబు, ఈ సినిమా తారాగణంలో చేరారు. STR,  కమల్ హాసన్‌తో స్క్రీన్‌ను షేర్ చేసుకోవాలని అభిమానులు ఎప్పటినుంచో కోరుకున్నారు. చెక్క చివంత వానం/నవాబ్ వంటి అద్భుతమైన గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రం తర్వాత శింబు, మణిరత్నం చిత్రంలో నటిస్తున్నారు.

కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా, మేకర్స్ ఒక అద్భుతమైన టీజర్‌ను విడుదల చేసారు, అది సినిమాపై క్యురీయాసిటీని మరింత పెంచింది. ఇది విజువల్ ఫీస్ట్‌ గా వుంది. బ్రెత్ టేకింగ్ విజువల్స్, యాక్షన్ షాట్‌లు గ్రేట్ ఎపిక్ యాక్షన్ అడ్వెంచర్‌ని ప్రామిస్ చేశాయి.

అలాగే, కమల్ హాసన్ డిఫరెంట్ లుక్స్‌తో పాటు నాయకన్ మూవీ కొన్ని కాల్ బ్యాక్స్ ఎక్సయిట్మెంట్ ని పెంచాయి. టీజర్‌తో పాటు సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేశారు, ఈ సినిమా జూన్ 5, 2025న గ్రాండ్‌గా విడుదల కానుంది. 

Thug Life release date announced :

Thug Life release date announced with a Visual Feast teaser
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs