Advertisement
Google Ads BL

బిగ్ లైనప్ తో ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ గా ప్రభాస్


ప్రాంతీయ సినిమా హద్దులు దాటి పాన్ ఇండియా రేంజ్ కు వెళ్లిన స్టార్ హీరోస్ చాలా కొద్దిమందే కనిపిస్తారు. తన బ్లాక్ బస్టర్ సినిమాలు, రికార్డ్ బాక్సాఫీస్ వసూళ్లతో వారిలో ముందు నిలుస్తున్నారు రెబెల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమాతో మొదలైన ప్రభాస్ పాన్ ఇండియా జర్నీ రీసెంట్ గా కల్కితో దిగ్విజయంగా కొనసాగుతోంది. థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్, ఓవర్సీస్ బిజినెస్..ఇలా ఏ విషయంలో చూసినా ప్రభాస్ మరే స్టార్ హీరో అందుకోలేనంత స్థాయికి చేరుకున్నారు.

Advertisement
CJ Advs

ప్రభాస్ సినిమాలు బాలీవుడ్ స్టార్స్ తో పోటీ పడేంతగా నార్త్ లో కలెక్షన్స్ సాధిస్తున్నాయి. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఛరిష్మా ఉత్తరాది ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. అందుకే బాలీవుడ్ లో తన సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేస్తున్నారు ప్రభాస్. తమిళ, మలయాళ, కన్నడలోనూ స్థానిక స్టార్ హీరోలతో ప్రభాస్ సినిమాలు పోటీ పడటం నిజమైన పాన్ ఇండియా ట్రెండ్ కు నిదర్శనంగా నిలుస్తోంది. ఓవర్సీస్ లోనూ ప్రభాస్ ఆకర్షణకు తిరుగులేదు. ఆయన సలార్, కల్కి సినిమాలు ఓవర్సీస్ లో వసూళ్ల చరిత్ర సృష్టించాయి.

డిజిటల్ మార్కెట్ లో హిందీ, రీజనల్ గా హక్కుల్ని తీసుకునే ట్రెండ్ ప్రభాస్ సినిమాలతో మరింతగా పెరిగింది. సలార్ హిందీ వెర్షన్ హాట్ స్టార్ తీసుకోగా, రీజనల్ లాంగ్వేజ్ లు నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. కల్కి సినిమా హిందీ రైట్స్ నెట్ ఫ్లిక్స్ తీసుకోగా, ప్రైమ్ వీడియో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ రైట్స్ కొనుగోలు చేసింది. ఇలా థియేట్రికల్, ఓటీటీ, ఇతర బిజినెస్ ల ద్వారా ప్రభాస్ సినిమాలు నిర్మాణ వ్యయానికి ఎన్నో రెట్ల లాభాలు ఆర్జిస్తున్నాయి.  నిర్మాతలకు ప్రభాస్ సినిమాలు బెస్ట్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్ తీసుకొస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం తన ప్రాంఛైజీ సినిమాలతో భారీ పాన్ వరల్డ్ లైనప్ చేసుకున్నారు. ఆయన సలార్ 2, కల్కి 2, స్పిరిట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నాయి.

India Biggest Superstar Prabhas :

India Biggest Superstar Prabhas incredible Pan India Lineup
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs