Advertisement

మాస్ జాతర చేస్తానంటున్న రవితేజ


మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం తన కెరీర్ లో మైలు రాయి గా నిలిచిపోయే చిత్రం RT 75 చేస్తున్నారు. రచయిత-దర్శకుడు భాను భోగవరపు డైరెక్షన్ లో సితార ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్నఈ చిత్రం యొక్క టైటిల్ ని, అలాగే రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించారు

Advertisement

దీపావళి శుభ సందర్భంగా రవితేజ 75వ చిత్రానికి మాస్ జాతర అనే టైటిల్ ను పెట్టారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ సృజనాత్మకంగా, కట్టిపడేసేలా ఉంది. జాతర సందడిలో, దీపావళి పండుగను తలపిస్తూ టపాసుల వెలుగుల నడుమ, తుపాకీ పట్టుకొని నడిచి వస్తున్న రవితేజ పోస్టర్ ఆకట్టుకుంటుంది. 

మాస్ జాతర చిత్రం మే 9, 2025న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానున్నట్లుగా ప్రకటించారు. మాస్ జాతర అనే టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సినిమా థియేటర్లలో మాస్ జాతరను తలపిస్తుందని నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేశారు.

రవితేజ అంటేనే వినోదానికి, మాస్ సినిమాలకు పెట్టింది పేరు. అలాంటి రవితేజ, తన నుంచి మంచి మాస్ ఎంటర్‌టైనర్ ను కోరుకునే అభిమానులు, ప్రేక్షకుల కోసం మాస్ జాతరతో రాబోతున్నారు. ఇది విందు భోజనంలా, అసలుసిసలైన మాస్ మహారాజా సినిమాలా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది.

ఈ సినిమాలో యువ సంచలనం శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. రవితేజ-శ్రీలీల జోడి గతంలో ధమాకాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. వీరి కలయికలో మాస్ జాతర రూపంలో మరో బ్లాక్ బస్టర్ రావడం ఖాయమని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.

RT75 titled as MASS JATHARA:

Ravi Teja, Bhanu Bhogavarapu, Sithara Entertainments prestigious RT75 titled as MASS JATHARA
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement