Advertisement
Google Ads BL

గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్ కి అదిరిపోయే డీల్


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మీదున్న అంచనాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రస్తుతం ఈ చిత్రం నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఫ్యాన్సీ మొత్తానికి అమ్ముడయ్యాయి. ఇది రామ్ చరణ్ కెరీర్‌లోనే హయ్యస్ట్. భారీ రేటుకే నార్త్‌లో గేమ్ చేంజర్ అమ్ముడైపోయింది.

Advertisement
CJ Advs

ప్రఖ్యాత దర్శకుడు శంకర్‌ తెరకెక్కించిన గేమ్ ఛేంజర్ కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. జనవరి 10, 2025న సంక్రాంతికి ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఇటీవల విడుదలైన జరగండి, రా రా మచ్చ అనే రెండు ఎలక్ట్రిఫైయింగ్ పాటలు శ్రోతలను తెగ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం నుంచి రావాల్సిన టీజర్, ట్రైలర్ మరియు మిలిగిలిన పాటలు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

గేమ్ ఛేంజర్ ప్రీ-రిలీజ్ బిజినెస్ గురించి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీని నార్త్‌లో అనిల్ తడాని AA ఫిల్మ్స్ ద్వారా రిలీజ్ చేయబోతోన్నారు. ఉత్తర భారతదేశ పంపిణీ హక్కులను భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు ఈ మేరకు మేకర్స్ ప్రకటించారు. ఇక నార్త్‌లో ఈ చిత్రాన్ని ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేయబోతోన్నారు.

గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ నిజాయితీగా గల ఐఏఎస్ అధికారిగా, అణగారిన వర్గాల సంక్షేమం కోసం పోరాడే రాజకీయ నాయకుడిగా కనిపించబోతోన్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా, తెలుగు నటి అంజలి కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతం, నేపథ్య సంగీతం స్పెషల్ అట్రాక్షన్ కానుంది. ఎడిటింగ్‌ను బాధ్యతను ప్రఖ్యాత ద్వయం షమ్మర్ ముహమ్మద్, రూబెన్ నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్, న్యూజిలాండ్, ఆంధ్రప్రదేశ్, ముంబై, చండీగఢ్‌తో సహా విభిన్న ప్రదేశాలలో షూట్ చేసిన గేమ్ ఛేంజర్ విజువల్ వండర్‌గా ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. కార్తీక్ సుబ్బరాజ్ అందించిన పవర్ ఫుల్ స్టోరీకి శంకర్ తన విజన్‌ను జోడించి భారీ ఎత్తున తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్‌పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Game Changer for North India Storm with AA Films :

Game Changer for North India Storm with AA Films bagging the distribution rights <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs