Advertisement
Google Ads BL

బిగ్గెస్ట్‌ రిలీజ్‌ ఇండియన్‌ సినిమాగా పుష్ప-2


ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ సన్సేషనల్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఇండియన్ ఫిలిం పుష్ప-2. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని భారతదేశ ప్రముఖ నిర్మాణ సంస్థలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్‌పై అభిరుచి గల నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌.వైలు సుకుమార్‌ రైటింగ్స్ అసోసియేషన్‌తో నిర్మిస్తున్నారు. రోజు రోజుకు పుష్ప-2 చిత్రంపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన అప్‌డేట్‌తో పాటు ప్రమోషనల్‌ కంటెంట్‌ కూడా ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. 

Advertisement
CJ Advs

విడుదలైన టీజర్‌, రెండు పాటలు ఎంతటి సన్సేషన్స్‌ సాధించాయో చెప్పాల్సిన అవసరం లేదు. డిసెంబరు 5న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఇటీవల జరిగిన నేషనల్‌ ప్రెస్‌మీట్‌లో తెలియజేశారు నిర్మాతలు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో సన్సేషనల్‌ న్యూస్‌ను వెల్లడించారు మేకర్స్‌. పుష్ప-2 చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో కలిపి  11,500 స్ర్కీన్స్‌ల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిపారు మేకర్స్‌. ఇండియాలో 6500 స్ర్కీన్స్‌ల్లో, ఓవర్సీస్‌లో 5000 స్ర్కీన్స్‌ల్లో గ్రాండ్‌ విడుదలకు ప్లాన్‌ చేస్తున్నామని తెలిపారు నిర్మాతలు. 

అయితే ఇది  బిగ్గెస్ట్‌ రిలీజ్‌ ఇండియన్‌ సినిమాగా ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఏ ఇండియన్‌ సినిమా కూడా ఇలాంటి ఘనత సాధించలేదని అంటున్నాయి ఇండియన్‌ ఫిల్మ్‌ సర్కిల్స్‌. ఇక పుష్ప-2 బాక్సాఫీస్‌ రూల్‌లో కలెక్షన్ల పరంగా బాక్సీఫీస్‌ వద్ద ఎన్నో సంచలనాలు కూడా సృష్టిస్తుందని అంటున్నాయి ట్రేడ్‌ విశ్లేషకులు.

Pushpa-2 Sets Record with 11,500 Screens :

Pushpa-2 Sets Record with 11,500 Screens in Biggest Ever Indian Film Release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs