Advertisement
Google Ads BL

50 రోజుల్లో పుష్ప-2 ది రూల్‌


50 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పుష్ప రాజ్‌ రూల్‌! పుష్ప-2 ది రూల్‌ కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ పుష్పరాజ్‌ మాసివ్‌ పోస్టర్‌తో క్రేజీ అప్‌డేట్‌ వదిలిన మేకర్స్‌ డిసెంబరు 6న ప్రపంచవ్యాప్తంగా పుష్ప-2 దిరూల్‌.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి పుష్ప-2 ది రూల్‌ మీదే. ఈ సినిమాకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా భారతీయ సినీ పరిశ్రమ యావత్‌ ఎదురుచూస్తున్న సినిమా ఇది. అది మన తెలుగు సినిమా కావడం గర్వకారణం. ఇక పుష్ప-2 ది రూల్‌.. డిసెంబరు 6న ప్రారంభం కానున్న పుష్పరాజ్‌ రూల్‌కు కౌంట్‌స్టార్‌ అయ్యింది.

Advertisement
CJ Advs

మరో 50 రోజుల్లో అంటే డిసెంబరు 6న పుష్ప-2 ది రూల్‌ బాక్సాఫీస్‌పై ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ ఐకాన్‌స్టార్‌ మాసివ్‌ లుక్‌తో పుష్పరాజ్‌గా రూల్‌ చేయడానికి  సింహాసనం అధిష్టించిన ఓ పోస్టర్‌ను వదిలారు. అంతేకాదు డిసెంబరు 6న భారతీయ సినిమాలో ఆ రోజు ఓ సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుందని హింట్‌ ఇచ్చారు. మేకర్స్‌ ప్రతి సీన్‌కు గూజ్‌బంప్స్‌తో పాటు పుష్ప ది రూల్‌కు అందరూ ఫిదా అయిపోవాల్సిందే అంటున్నారు. మీరు ఎంత ఊహించుకుంటే అంతకు మించి.. అస్సలు తగ్గేదెలే లా చిత్రం వుండబోతుందనే విశ్వాసంతో వున్నారు చిత్ర మేకర్స్‌. పుష్ప దిరైజ్‌తో బార్డర్‌లు దాటిన  ఇమేజ్‌తో.. అద్వితీయమైన నటనతో.. ఎవరూ ఎక్స్‌పెక్ట్‌ చేయని క్రేజ్‌తో దూసుకపోతున్న ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ పుష్ప-2 లో మైస్మరైజింగ్‌ నటన కోసం, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ టేకింగ్‌.. మేకింగ్‌.. కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్‌ అసోసియేషన్‌ విత్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థల పతాకంపై ప్రముఖ నిర్మాతలు, నవీన్ ఏర్నేని, వై రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి వచ్చిన రెండు సాంగ్స్‌, టీజర్‌కు ఎంతటి అనూహ్యమైన స్పందన వచ్చిందో తెలిసిందే. దేవి శ్రీప్రసాద్‌ అందించిన అందించిన ట్రెండీ పాటలకు అద్వితీయమైన స్పందన వచ్చింది. ఇక పుష్ప-2 ది రూల్‌ నుండి రానున్న ప్రతి ప్రమోషనల్‌ కంటెంట్‌ కూడా అంతే క్రేజీతో రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్‌ చివరి దశలో వున్న ఈ చిత్రం, మరోవైపు నిర్మాణానంతర పనులను కూడా శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌హాఫ్‌ పర్‌ఫెక్ట్‌ లాక్ అయిన సంగతి తెలిసిందే. కంటెంట్‌ పరంగానే కాకుండా టెక్నికల్‌గా కూడా పుష్ప-2 అత్యున్నత స్థాయిలో వుండబోతుంది. ఇక డిసెంబరు 6న అందరూ పుష్ప ది రూల్‌ డే అని ఎదురుచూస్తున్నారు అని మేకర్స్‌ తెలియచేస్తున్నారు.

Pushpa 2: The Rule theaters on December 6th:

 Icon Star Allu Arjun exudes aura of power and authority in latest Pushpa 2: The Rule poster
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs