Advertisement
Google Ads BL

ఫణి నా కెరీర్లోనే ఛాలెంజింగ్ మూవీ : కేథరిన్ 


సీనియర్ స్టార్ దర్శకుడు డాక్టర్ వి ఎన్ ఆదిత్య తెరకెక్కిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఫణి. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఓ. ఎం. జీ ప్రొడక్షన్స్‌ సంస్థ పై... ఏయు & ఐ స్టూడియో సమర్పణలో డాక్టర్‌ మీనాక్షి అనిపిండి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ కేథరీన్ ట్రెసా లీడ్ రోల్ పోషిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. తాజాగా ఫణి చిత్రం నుండి టైటిల్,ఓ.ఎమ్.జీ ప్రొడక్షన్స్ బ్యానర్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అమెరికాలోని  డల్లాస్ ఈ వేడుకని నిర్వహించారు. ఫణి సినిమా టైటిల్ ను డాక్టర్ తోటకూర ప్రసాద్ లాంఛ్ చేయగా,ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర బ్యానర్ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆళ్ల శ్రీనివాస రెడ్డి, డాక్టర్ ఇస్మాయిల్ సుహైల్ పెనుగొండ అతిథులుగా పాల్గొని ఫణి సినిమా టీమ్ కు తమ బెస్ట్ విషెస్ అందించారు. 

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా నిర్మాత  అనిల్ సుంకర మాట్లాడుతూ...  ఓ.ఎం.జీ ప్రొడక్షన్స్ టాలీవుడ్ మూవీ మేకింగ్ లోకి రావడం హ్యాపీగా ఉంది. ఈరోజు 90 శాతం టాలీవుడ్ మూవీ ప్రొడక్షన్ చేస్తున్నది అమెరికాలో ఉంటున్న తెలుగు ప్రొడ్యూసర్సే. ఫణి మూవీ టైటిల్ బాగుంది. మీనాక్షి గారి మ్యూజిక్ ఆకట్టుకుంది. డాక్టర్ వి ఎన్ ఆదిత్య గారికి, ఇతర టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఓ.ఎం.జీ ప్రొడక్షన్స్ లో మరిన్ని మూవీస్ రావాలి. అన్నారు.

హీరోయిన్ కేథరీన్ ట్రెసా మాట్లాడుతూ... ఫణి మూవీ కథ విన్న వెంటనే ఈ మూవీ చేస్తానని చెప్పాను. కథ నన్ను అంతగా ఇంప్రెస్ చేసింది. నా కెరీర్ లో చేస్తున్న ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఇదేనని చెప్పగలను. దర్శకుడు డాక్టర్ వి ఎన్ ఆదిత్య గారితో వర్క్ చేయడం వండర్ ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఆయనకు ఫిలిం మేకింగ్ మీద ఉన్న డెడికేషన్ కి హ్యాట్సాఫ్. అలాగే ఆయన చాలా నాలెజ్డ్ పర్సన్. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఓ.ఎం.జీ సంస్థ తమ తొలి చిత్రానికి నన్ను సెలెక్ట్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. త్వరలోనే మీ ముందుకు ఓ మంచి థ్రిల్లర్ మూవీతో రాబోతున్నాం అంటూ చెప్పుకొచ్చారు.

Phani Movie :

Phani Movie Press Meet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs