Advertisement
Google Ads BL

తండేల్ : చైతు-సాయి పల్లవి సర్ ప్రైజ్


నాగ చైతన్య మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ తండేల్. చందూ మొండేటి దర్శకత్వంలో ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా డి.మత్స్య లేశం గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తండేల్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నిజమైన సంఘటనలే అయినప్పటికీ, ఇద్దరు ప్రేమికుల మధ్య వారి జీవితాల్లో జరిగిన ఎమోషన్స్, ఇన్సిడెన్స్ చాలా గ్రిప్పింగ్  గా ఫిక్షనల్ స్టొరీ కంటే థ్రిల్లింగ్ గా వుండబోతున్నాయి.

Advertisement
CJ Advs

శైవ క్షేత్రం దక్షిణ కాశీగా పేరుగాంచిన పురాతన శివాలయం శ్రీకాకుళంలోని శ్రీ ముఖలింగం. ఇక్కడ  మహాశివరాత్రి ఉత్సవాల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.  

దీని స్ఫూర్తితో, టీమ్ సినిమా కోసం అద్భుతమైన, మునుపెన్నడూ చూడని శివరాత్రి పాటను చిత్రీకరీంచింది. మ్యాసీవ్ సెట్స్, హై ప్రొడక్షన్ వాల్యూస్ తో అద్భుతమైన శివరాత్రి సాంగ్ ని గ్రాండ్ గా స్కేల్ లో షూట్ చేశారు.

దేవి శ్రీ ప్రసాద్ ఒక టైమ్‌లెస్ క్లాసిక్ సాంగ్ ని కంపోజ్ చేసారు, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ లో నాగ చైతన్య, సాయి పల్లవి, వేలాది మంది డ్యాన్సర్‌లతో కలిసి అద్భుతంగా అలరించారు. ఈ శివరాత్రి పాట ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ లతో నాగ చైతన్య కెరీర్‌లో మోస్ట్ స్పెషల్ సాంగ్స్ లో ఒకటిగా వుండబోతోంది. ఈ అద్భుతమైన శివరాత్రి పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి టీమ్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సాంగ్ షూట్ నుండి రెండు పోస్టర్లను మేకర్స్ విడుదల చేసారు. నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరూ   డ్యాన్సర్లతో పాటు డ్యాన్స్ చేస్తూ సంప్రదాయ దుస్తులలో కనిపించారు. పోస్టర్లు హై ప్రొడక్షన్ వాల్యూస్,  గ్రాండ్ స్కేల్ ని ప్రజెంట్ చేశాయి.

Thandel Spectacular Shivaratri Song:

Naga Chaitanya - Sai Pallavi Thandel Filming Shivaratri Song
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs