Advertisement
Google Ads BL

గేమ్ ఛేంజర్: రా మ‌చ్చా కు వేళయ్యింది


రామ్ చరణ్ గేమ్ చేంజర్  2024 క్రిస్మస్ సందర్భంగా సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధ‌మ‌వుతోన్న ఈ సినిమాపై అంచ‌నాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన జరగండి జరగండి.. సాంగ్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు సెకండ్ సాంగ్‌గా రా మ‌చ్చా మ‌చ్చా.. రాక‌కు  రంగం సిద్ధ‌మైంది. లార్జ‌ర్ దేన్ లైఫ్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురిచేసే స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌.. త‌న‌దైన స్టైల్లో గేమ్ చేంజ‌ర్ సెకండ్ సాంగ్‌ను చిత్రీక‌రించారు. 

Advertisement
CJ Advs

మ్యూజిక‌ల్ సెన్సేష‌న్ త‌మ‌న్ సంగీత సారథ్యంలో రూపొందిన రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్  ప్రోమోను సెప్టెంబ‌ర్ 28న రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 30న పాట రిలీజ్ అవుతుంది. ఇండియ‌న్ సినీ హిస్ట‌రీలో నెవ్వ‌ర్ బిఫోర్ అనేలా ఎన్నో గొప్ప సినిమాలు, పాట‌ల‌ను చిత్రీక‌రించిన స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ మ‌రోసారి త‌న మార్క్‌ను గేమ్ చేంజ‌ర్‌లో సెకండ్ సాంగ్ చిత్రీక‌ర‌ణ‌లో చూపించ‌బోతున్నారు. ఏకంగా 1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులు ఈ పాట‌లో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి డాన్స్ చేయటం విశేషం. అది కూడా భిన్న‌త్వానికి ఏక‌త్వమైన మ‌న దేశంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒరిస్సా, క‌ర్ణాట‌క‌, వెస్ట్ బెంగాల్‌, జార్ఖండ్  రాష్ట్రాల‌కు చెందిన జాన‌ప‌ద క‌ళాకారులు.. ఇందులో భాగ‌మ‌వ‌టం విశేషం. ఈ సాంగ్ చిత్రీక‌ర‌ణ‌కు సంబంధించిన విశేషాల గురించి డైరెక్ట‌ర్ శంక‌ర్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ ప్ర‌త్యేకంగా మాట్లాడారు. 

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ మాట్లాడుతూ గ్లోబల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్‌తో క‌లిసి గేమ్ చేంజ‌ర్ సినిమాకు వ‌ర్క్ చేయ‌టం హ్యాపీగా ఉంది. నేను రామ్ చ‌ర‌ణ్ కోసం ఓ ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్ కావాల‌ని త‌మ‌న్‌ను అడిగాను. డిఫ‌రెంట్‌గా చేద్దామ‌ని ఇద్ద‌రం అనుకున్నాం. చాలా సేపు డిస్క‌ష‌న్ చేసుకున్నాం. ఒక‌రి స‌ల‌హాల‌ను ఒక‌రు విన్నాం. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సంస్కృతుల‌ను బేస్ చేసుకుని పాట‌ను చేస్తే బావుంటుంద‌నిపించింది. దానిపై చాలా రీసెర్చ్ చేశాం. ఏపీలో గుసాడి, కొమ్ము కోయ‌, త‌ప్పెట గుళ్లు వంటి జాన‌ప‌ద నృత్యాల‌ను పాట‌లో భాగం చేయాల‌నుకున్నాను. అలాగే ప్రేక్ష‌కుల‌కు వీటితో పాటు ఇంకా బెస్ట్ ఇవ్వాల‌నిపించింది. అందులో భాగంగా వెస్ట్ బెంగాల్‌కు చెందిన చౌ, ఒరిస్సాకు చెందిను గుమ్రా, రాన‌ప్ప‌, పైకా, దురువ వంటి వాటితో పాటు క‌ర్ణాట‌కు చెందిన హ‌లారి. ఒక్క‌లిగ‌, గొర‌వ‌ర‌, కుణిత వంటి నృత్య రీతుల‌ను కూడా భాగం చేయాల‌నుకుని చాలా రీసెర్చ్ చేసి చేశాం. దీని వ‌ల్లు పాట చాలా గ్రాండియ‌ర్ లుక్‌తో రావ‌ట‌మే కాదు, సౌండింగ్ కూడా ఇది వ‌ర‌కు ఎన్న‌డూ విన‌నంత కొత్త‌గా వ‌చ్చింది. త‌మ‌న్‌తో మాట్లాడిన త‌ర్వాత త‌ను రెండు రోజులు అన్నీ సంస్కృతుల‌ను షూట్ చేశారు. పాట ఒక సెల‌బ్రేష‌న్‌లా ఉంటుంది. రామ్ చ‌ర‌ణ్ అద్భుత‌మైన డాన్స‌ర్‌. గ‌ణేష్ ఆచార్య‌గారు ఈ పాట‌కు కొరియోగ్ర‌ఫీ అందించారు. చ‌ర‌ణ్ అయితే ఓ బీజీఎంను సింగిల్ షాట్‌లో పూర్తి చేయ‌టం విశేషం. ఇది చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌, సినీ ల‌వ‌ర్స్‌కు ఓ ట్రీట్‌లా ఉంటుంది. లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ పాట‌ను సూప‌ర్బ్‌గా రాశారు. దిల్ రాజు, శిరీష్‌గారు చాలా స‌పోర్ట్‌గా నిలిచారు అన్నారు. 

మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ మాట్లాడుతూ గేమ్ చేంజ‌ర్‌లోని రా మ‌చ్చా మ‌చ్చా సాంగ్‌లో అన్నీ సంస్కృతుల‌ను చూపించ‌టం ఐ ఫీస్ట్‌లా ఉంటుంది. శంక‌ర్‌గారు చాలా హుక్ లైన్స్ రాశారు. చివ‌ర‌కు రా మ‌చ్చా మ‌చ్చా.. అనే లైన్‌ను సెల‌క్ట్ చేసుకున్నారు.  పాట‌ను స్క్రీన్‌పై చూస్తున్న‌ప్పుడు ఎంజాయ్ చేస్తారు. సెప్టెంబర్ 30న పాట రిలీజ్ కానుంది అన్నారు.

Ram Charan Game Changer drops Raa Macha fire :

Ram Charan Game Changer Raa Macha gets date: Specialties Revealed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs