Advertisement
Google Ads BL

కన్నప్ప నుంచి ఐశ్వర్య మారెమ్మ లుక్


విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప నుంచి అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. విష్ణు చెప్పినట్టుగా ప్రతీ సోమవారం కన్నప్ప నుంచి అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. కన్నప్ప మూవీ నుంచి రివీల్ చేస్తున్న కారెక్టర్లు, వారి ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకు శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా, అక్షయ్ కుమార్ పాత్రలకు సంబంధించి లుక్‌ను విడుదల చేశారు.

Advertisement
CJ Advs

గత వారం కన్నప్ప నుంచి విధేయుడు, స్నేహితుడు అంటూ తిన్నడు ఉపయోగించే గుర్రం టిక్కి లుక్‌ను రిలీజ్ చేశారు. ఇక ఈ సోమవారం కన్నప్ప నుంచి మారెమ్మ పాత్రకు సంబంధించిన లుక్‌ను రిలీజ్ చేశారు. నటి ఐశ్వర్య ఈ మారెమ్మ లుక్‌లో అందరినీ భయపెట్టేలా ఉన్నారు. అడివిని పీడించే అరాచకం మారెమ్మ.. కుతంత్రమే ఆమె మంత్రం అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.

ఇప్పటికే కన్నప్ప టీజర్‌తో సినిమా మీద మంచి హైప్ ఏర్పడింది. విష్ణు మంచు టైటిల్ రోల్‌లో కనిపించనున్న కన్నప్ప అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా రాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. డిసెంబర్‌లో ఈ సినిమా పాన్‌ ఇండియా వైడ్‌గా విడుదల కానుంది.

Aishwarya Maremma look from Kannappa:

Meet Aishwarya as Maremma from Kannappa
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs